చుండ్రును పోగొట్టే ఎఫెక్టివ్ టిప్స్..!


Sat,November 11, 2017 02:57 PM

ఏ కాలంలో అయినా స‌హ‌జంగా చాలా మందికి చుండ్రు స‌మ‌స్య ఉంటుంది. అయితే ఈ కాలంలో మ‌రింత ఎక్కువ‌గా చుండ్రు ఇబ్బందులు పెడుతుంది. ఈ క్ర‌మంలోనే అంద‌రూ ర‌క‌ర‌కాల టిప్స్ పాటిస్తూ చుండ్రును వ‌దిలించుకునేందుకు అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. అయితే అలాంటి బాధ ప‌డ‌కుండా ఉండాలంటే కింద ఇచ్చిన ప‌లు ఎఫెక్టివ్ టిప్స్ ను ట్రై చేయండి. వీటితో చుండ్రు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. వేడి నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల చుండ్రును అరికట్టవచ్చు. రాత్రి పడుకునే ముందు ఏదైనా హెయిర్ ఆయిల్‌ను వేడి చేసి జుట్టుకు పట్టించాలి. ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

2. అరకప్పు పెరుగులో 5 టీస్పూన్ల నిమ్మరసం కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో 3 రోజులు చేయాలి.

3. కొన్ని వేప ఆకులు రుబ్బి, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి జుట్టుకు రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడ‌గాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

4. కలబంద ఆకు నుంచి తాజా జెల్‌ను తీసుకొని తలకు రాసుకోవాలి. ఆరగంట తర్వాత మెడికేటెడ్ షాంపూతో తలస్నానం చేస్తే చాలు. చుండ్రు పోతుంది.

5. మూడు వెల్లుల్లి పాయల్ని తీసుకొని బాగా పేస్టులా చేసి, టీ స్పూన్ తేనె కలుపాలి. ఆ పేస్ట్‌ను తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేసినా చుండ్రు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4869

More News

VIRAL NEWS