అధిక కొవ్వును క‌రిగించే.. కొత్తిమీర‌..!


Sun,November 12, 2017 06:39 PM

చక్కని సువాసన, కమ్మని రుచి 'కొత్తిమీర' సొంతం. దీన్ని వివిధ ఆహార పదార్థాల్లో వేస్తే ఆ రుచి అదరహో అనిపించడం ఖాయం. అది మాత్రమే కాదు, దీన్ని తరచూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

1. కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ. మెగ్నిషియం, ఇనుము, మాంగనీస్‌లు తగిన మోతాదులో లభిస్తాయి. విటమిన్ సి, కెతోపాటు ప్రోటీన్లూ ఎక్కువే. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో హాని చేసే కొవ్వు తగ్గుతుంది.

2. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మధుమేహంతో బాధపడే వారికి ఇది చక్కని ఔషధంలా పనిచేస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వల్ని సమన్వయ పరుస్తుంది. ఇష్టపడే వారు కొత్తిమీర రసాన్ని కూడా తాగొచ్చు.

3. కొత్తిమీరలో అధికంగా లభించే విటమిన్ కె వయసు మళ్లిన తరువాత వచ్చే మతిమరుపు వ్యాధి నియంత్రణలో కీలకంగా పనిచేస్తుంది.

4. కొవ్వుని కరిగించే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో అధికంగా లభిస్తాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తాయి.

5. కొత్తిమీరలోని యాంటీ సెప్టిక్ లక్షణాలు నోటి పూతను అదుపులో ఉంచుతాయి. నెలసరి ఇబ్బందులను తగ్గిస్తాయి.

3193

More News

VIRAL NEWS