బెండకాయలను తరచూ తింటే కలిగే అద్భుతమైన లాభాలివే..!


Sun,June 10, 2018 05:44 PM

బెండకాయలను ఫ్రై చేసినా, వాటిని పులుసు పెట్టినా అవి చాలా రుచికరంగానే ఉంటాయి. ఎంతో మంది బెండకాయ రుచిని వివిధ వంటకాల రూపంలో ఆస్వాదిస్తుంటారు. అయితే మనకు రుచిని ఇవ్వడంలోనే కాదు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడంలోనూ బెండకాయ అమోఘంగా పనిచేస్తుంది. బెండకాయలను తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పలు కీలకమైన పోషకాలు అందడమే కాదు, వాటి వల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని సాక్షాత్తూ సైంటిస్టులే పరిశోధనలు చేసి మరీ చెబుతున్నారు. ఈ క్రమంలోనే బెండకాయల వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


1. బెండకాయల్లో ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి. పోషకాహార లోపం నుంచి బయట పడేలా చేస్తాయి.

2. బెండకాయల్లో సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. తద్వారా మనం ఆహారం తినడం తగ్గిస్తాం. దీంతో బరువు తగ్గుతారు. కనుక బరువు తగ్గాలనుకునేవారు బెండకాయలను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

3. బెండకాయల్లో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నీరసం, అలసట రాకుండా చూస్తాయి. యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి.

4. డయాబెటిస్ ఉన్నవారికి బెండకాయలు చేసే మేలు అంతా ఇంతా కాదు. బెండకాయలను తినడం వల్ల క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

5. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించేందుకు బెండకాయలు దోహదం చేస్తాయి. వీటిని తినడం వల్ల ట్రై గ్లిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి.

6. బెండకాయల్లో ఉండే విటమన్ కె ఎముకలను దృఢంగా చేస్తుంది. గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టాలంటే విటమిన్ కె అవసరం. బెండకాయల్లో ఉండే విటమిన్ కె అందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే రక్త స్రావ సమస్యలున్నవారికి కూడా మేలు చేస్తుంది.

7. బెండకాయల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నందున వాటిని తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే నేత్ర సమస్యలు పోతాయి. కంటి చూపు మెరుగు పడుతుంది.

8. హెచ్.పైలోరీ బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వస్తే జీర్ణాశయం లోపలి పొర వాపునకు లోనై గ్యాస్ సమస్య వస్తుంది. అలాంటి వారు బెండకాయలను తింటే ఫలితం ఉంటుంది. ఇది కడుపులో ఉండే చెడు బాక్టీరియాను నాశనం చేస్తుంది.

9. లివర్ ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరంలో అనేక జీవక్రియలు సజావుగా సాగుతాయి. బెండకాయలను తరచూ తినడం వల్ల లివర్ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. లివర్‌లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

10. నిత్యం ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యేవారు తమ ఆహారంలో బెండకాయలను చేర్చుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది.

11. మహిళలు బెండకాయలను తింటే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు బెండకాయల్లో ఉంటాయి.

12. ఆస్తమా ఉన్నవారు బెండకాయలను తరచూ తినాలి. దీంతో వాటిల్లో ఉండే విటమిన్ సి శ్వాస కోశ సమస్యలను పోగొడుతుంది. ఆస్తమాను తగ్గిస్తుంది.

10727

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles