క‌డుపులో మంట‌, గ్యాస్‌ను త‌గ్గించే ప‌వ‌ర్‌ఫుల్ చిట్కాలు..!


Sun,March 11, 2018 07:33 PM

వేళ త‌ప్పించి భోజ‌నం చేయ‌డం, కారం, మ‌సాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తిన‌డం, అతిగా ఆహారం తిన‌డం... ఇలా కార‌ణాలు ఏమున్నా క‌డుపులో మంట‌, గ్యాస్ స‌మ‌స్య‌లు అప్పుడ‌ప్పుడు మ‌నల్ని బాధిస్తుంటాయి. అయితే ఇందుకోసం మెడిక‌ల్ షాపుకు ప‌రిగెత్తాల్సిన ప‌నిలేదు. ఇంట్లో ఉండే ప‌లు ప‌దార్థాల‌తోనే ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు. మ‌రి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 టీస్పూన్ తేనెను క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని భోజ‌నానికి గంట ముందుగా లేదా భోజ‌నానంత‌రం గంట త‌రువాత సేవించాలి. లేదంటే రాత్రి పూట నిద్రపోయే ముందు కూడా తాగ‌వ‌చ్చు. దీంతో క‌డుపులో మంట‌, గ్యాస్ త‌గ్గుతాయి. ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

2. ఒక టేబుల్ స్పూన్ తేనె, 3/4 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడిని భోజ‌నం త‌రువాత తీసుకుంటే గ్యాస్‌, క‌డుపులో మంట వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

3. క‌ప్పు నీటిని మ‌రిగించి అందులో 1 టీస్పూన్ అల్లం మిశ్ర‌మాన్ని వేయాలి. అనంత‌రం వేడి త‌గ్గించి సిమ్మ‌ర్‌లో 5 నిమిషాల పాటు ఉంచాలి. త‌ర్వాత ఈ ద్ర‌వానికి 1 టీస్పూన్ తేనెను క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని త‌ర‌చూ తీసుకోవాలి.

4. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 టేబుల్ స్పూన్ అల్లం, కొద్దిగా నిమ్మ‌ర‌సం, 2 టేబుల్ స్సూన్ల తేనెను వేసి బాగా క‌లిపి దీన్ని గ్యాస్ స‌మస్య ఉన్న‌ప్పుడు తీసుకోవాలి.

5. ఒక టీస్పూన్ తేనె, 200 గ్రాముల పెరుగును క‌లిపి భోజ‌నం అనంత‌రం తీసుకోవాలి. ఇది జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది.

6. ఒక టీ స్పూన్ తేనె, కొద్దిగా ల‌వంగ పొడిని క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో వేసి క‌లిపి ఆ ద్ర‌వాన్ని తాగాలి. క‌డుపులో మంట‌గా ఉన్న‌ప్పుడు లేదా భోజ‌నం త‌రువాత దీన్ని తాగ‌వ‌చ్చు.

7. రెండు టీ స్పూన్ల నిమ్మ‌ర‌సం, 1 టీస్సూన్ తేనెల‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. దీన్ని భోజ‌నానికి గంట ముందు లేదా ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. త‌ర‌చూ ఈ మిశ్ర‌మాన్ని తాగుతుంటే మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది.

8. రెండు టేబుల్ స్పూన్ల తేనె, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ల‌ను ఒక క‌ప్పు నీటిలో బాగా క‌లిపి ఆ ద్ర‌వాన్ని స‌మ‌స్య ఉన్న‌ప్పుడు తీసుకోవాలి.

9. ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో 1 టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి పూర్తిగా క‌లిసేంత వ‌ర‌కు క‌లియ‌తిప్పాలి. అనంత‌రం ఆ ద్ర‌వాన్ని తాగితే గ్యాస్‌, క‌డుపులో మంట వంటి స‌మ‌స్య‌లు పోతాయి.

10. ఒక కప్పు గ్రీన్ టీలో 1 టీస్పూన్ తేనెను క‌లిపి తీసుకుంటే గ్యాస్, అజీర్ణం వంటి స‌మ‌స్యల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

11. కొవ్వు లేని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో 1 టీ స్పూన్ తేనెను క‌లిపి త‌ర‌చూ తీసుకుంటే గ్యాస్ స‌మ‌స్య‌లు పోతాయి.

12. తేనె, బేకింగ్ సోడా, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ల‌ను 1 టీ స్పూన్ మోతాదులో తీసుకుని మిశ్ర‌మం అయ్యేంత వ‌ర‌కు బాగా క‌ల‌పాలి. అర లీట‌రు గోరు వెచ్చ‌ని నీటికి ఈ మిశ్ర‌మాన్ని క‌ల‌పాలి. దీన్ని భోజ‌నానికి ముందుగా లేదా స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పుడు తీసుకోవ‌చ్చు.

16773

More News

VIRAL NEWS