పుచ్చ‌కాయ విత్త‌నాలు.. లాభాలు తెలిస్తే ప‌డేయ‌రు..!


Sun,April 16, 2017 10:44 AM

వేస‌వి కాలంలో పుచ్చ‌కాయ‌ను తింటే దాంతో మ‌న‌కు ఎన్ని ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న శ‌రీరానికి అవ‌స‌రమైన ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అందుతాయి. దీనికి తోడు ప‌లు అనారోగ్య స‌మస్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. అయితే కేవ‌లం పుచ్చ‌కాయ మాత్ర‌మే కాదు, అందులో ఉండే గింజ‌లు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌మే. వాటితో క‌లిగే లాభాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. పుచ్చ‌కాయ విత్త‌నాల్లో అనేక ర‌కాల ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్ ఉంటాయి. విట‌మిన్ బి, థ‌యామిన్‌, నియాసిన్‌, ఫోలేట్‌, పొటాషియం, ఐర‌న్‌, జింక్‌, పాస్ఫ‌ర‌స్‌, కాప‌ర్ వంటి పోష‌కాలు ఉంటాయి. వీటి వ‌ల్ల మ‌న‌కు శ‌క్తి కూడా బాగానే ల‌భిస్తుంది. కేవ‌లం 100 గ్రాముల పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తీసుకుంటే వాటిలో 600 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది.

2. పుచ్చకాయ విత్త‌నాల‌ను పుచ్చ‌కాయల్లాగే నేరుగా తిన‌వ‌చ్చు. కానీ వాటి రుచి చాలా మందికి న‌చ్చ‌దు. అయితే అలా తిన‌లేక‌పోతే వాటిని ఎండ‌బెట్టి పొడి చేసుకుని నీటిలో క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. లేదంటే విత్త‌నాల‌ను నీటిలో బాగా మ‌రిగించి ఆ నీటిని తాగాలి. అప్పుడు కింద చెప్పిన ఫ‌లితాలు క‌లుగుతాయి.

3. పుచ్చ‌కాయ విత్త‌నాల్లో ఫైబ‌ర్ కూడా ఎక్కువే. ఇది జీర్ణ సంబంధ స‌మ‌స్య‌ల‌ను తొల‌గిస్తుంది. జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయి.

4. లివ‌ర్ వ్యాధులు, వాపుల‌తో బాధ‌ప‌డే వారికి పుచ్చ‌కాయ విత్త‌నాలు చ‌క్క‌ని ఔష‌ధంగా ప‌నిచేస్తాయి.

5. పుచ్చ‌కాయ విత్త‌నాల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగానే ఉన్నాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డ‌మే కాదు, ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల‌ను న‌యం చేస్తాయి. క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకుంటాయి.

6. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ర‌క్త స‌ర‌ఫరా మెరుగు ప‌డుతుంది. గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగ‌వుతుంది.
water-melon-fruit
7. యాంటీ ఏజింగ్ ల‌క్ష‌ణాలు పుచ్చ‌కాయ విత్త‌నాల్లో ఉన్నాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌తలు పోతాయి.

8. డ‌యాబెటిస్ ఉన్న వారికి పుచ్చ‌కాయ విత్త‌నాలు మేలు చేస్తాయి. ఇవి వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను అదుపు చేస్తాయి. దీంతో మ‌ధుమేహం నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

9. జ్వ‌రం వంటివి వ‌చ్చిన‌ప్పుడు పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను మ‌రిగించి చేసిన నీటిని తాగిస్తే త్వ‌ర‌గా కోలుకుంటారు.

10. పుచ్చ‌కాయ విత్త‌నాల్లో జ్ఞాప‌క‌శ‌క్తి పెంచే ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ విత్త‌నాల‌ను నీటిలో మ‌రిగించి త‌యారు చేసిన మిశ్ర‌మాన్ని తాగితే మెమొరీ ప‌వ‌ర్ అద్భుతంగా పెరుగుతుంది.

11. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. వీర్యం వృద్ధి చెందుతుంది. శుక్ర క‌ణాల్లో బాగా క‌ద‌లిక వ‌స్తుంది. దీంతో సంతానం పొంద‌డానికి అధికంగా చాన్స్ ఉంటుంది.

12. ఒంట్లో నీరు అధికంగా చేరిన వారు పుచ్చ‌కాయ విత్త‌నాల‌తో చేసిన నీటిని తాగాలి. దీంతో ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

5511

More News

VIRAL NEWS