ఈ 10 సూచ‌న‌లు పాటిస్తే లివ‌ర్ డ్యామేజ్ అవ‌కుండా చూసుకోవ‌చ్చు..!


Sat,February 10, 2018 04:18 PM

మన శరీరంలోని ప్రధాన అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది శరీరంలోకెల్లా అతి పెద్ద గ్రంథిగా పిలవబడుతోంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో లివర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ చూపించలేనివారు లివర్‌కు సంబంధించిన పలు అనారోగ్యాల‌ను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అవే అనారోగ్యాలు పలు దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తున్నాయి. అయితే లివర్ డ్యామేజ్ అవడం వల్లే ప్రధానంగా ఇలాంటి అనారోగ్యాల బారిన పడాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన లివర్ చెడిపోకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రాత్రి పూట త్వరగా నిద్రపోవాలి. ఉదయాన త్వరగా నిద్రలేవాలి. ఇలా చేస్తే లివ‌ర్ డ్యామేజ్ అవ‌కుండా చూసుకోవ‌చ్చు.

2. ఉదయం నిద్ర లేచిన తరువాత కాలకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. లేదంటే లివర్‌లో వ్యర్థాలు పెరిగిపోతాయి.

3. అతిగా ఆహారం తీసుకున్నా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే అంతటి ఆహారాన్ని అరిగించడానికి లివర్‌కు ఎక్కువ సమయం పట్టడమే కాదు, దానిపై అదనపు భారం కూడా పడుతుంది.

4. ఉదయం అల్పాహారం మానేయకూడదు. లేదంటే లివర్‌పై ఒత్తిడి పెరుగుతుంది.

5. ఔషధాలను అతిగా సేవించినా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మందులను తక్కువగా, వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి.

6. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహారం, ఫుడ్ కలర్స్, ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు వేసి వండిన ఆహారం తిన్నా లివర్‌పై భారం పడుతుంది.

7. సరైన నూనె వాడకుండా వండిన ఆహారం తిన్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన నాణ్యత కలిగిన నూనెను మాత్రమే వంటకాలకు ఉపయోగించాలి.

8. ఆహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే లివర్‌పై భారం పెరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి.

9. కూరగాయాలను ఒకవేళ ఫ్రై చేసి తింటే కేవలం ఒకేసారి వాటిని తినాలి. నిల్వ చేసి రెండోసారి తినకూడదు.

10. మద్యం సేవించడం కూడా లివర్ నాశనానికి కారణమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మద్యాన్ని పూర్తిగా మానేయడమే మంచిది.

5394

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles