బ‌రువు పెర‌గాలా..? ఈ సూచ‌న‌లు పాటించండి..!


Sun,January 7, 2018 02:53 PM

నేటి తరుణంలో చాలా మంది అధిక బరువు సమస్య నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటే, సన్నగా ఉన్న వారు మాత్రం లావుగా ఎలా అవ్వాలా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారు బరువు పెరిగేందుకు అనేక రకాల పద్ధతుల ప్రయత్నించి ఉంటారు. బాగా ఆహారం కూడా తిని ఉంటారు. కానీ అసలు ఏ మాత్రం కూడా బరువు పెరగడం లేదని వాపోతుంటారు. అయితే అలాంటి వారు కింద చెప్పిన పలు సూచనలు పాటిస్తే దాంతో ఎఫెక్టివ్‌గా బరువు పెరగవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. బరువు పెరగాలనుకునే వారు సోయా బీన్‌ను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతగానో అవసరం. దీంతో శారీరక దృఢత్వం కలుగుతుంది. బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

2. వారంలో కనీసం 3 సార్లు ఏదైనా ఫ్రూట్ జ్యూస్‌ను తాగాలి.

3. మాంసం తినేవారు వారంలో 2 సార్లు దాన్ని తినేలా ప్లాన్ చేసుకోవాలి.

4. పాలు, పెరుగు, నెయ్యిలను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతోపాటు అన్నం, మినప పప్పును ఎక్కువగా తినాలి.

5. రోజూ వ్యాయామం చేయాలి. అధికంగా తినే ఆహారం సరిగ్గా ఖర్చయి బరువు పెరుగుతారు.

6. దాల్చిన చెక్క, వెల్లుల్లి, అల్లం, యాలకులు, లవంగాలు తదితర మసాలా ఆహారాలను తింటే ఆకలి పెరుగుతుంది. దీని వల్ల ఆహారం ఎక్కువగా తీసుకుని బరువు పెరగవచ్చు.

7. రోజూ 8 గంటలు నిద్రపోవాలి.

8. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ ఆవు పాలలో చిటికెడు పసుపు కలిపి తాగాలి.

9. ఆహారం తినేటప్పుడు నెమ్మదిగా తినాలి. వేగంగా తినరాదు.

10. భోజనం చేసేటప్పుడు చుట్టు పక్కల పరిసరాలు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.

7002

More News

VIRAL NEWS