రోజూ గుప్పెడు కిస్‌మిస్‌ల‌ను తింటే.. ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?


Thu,January 11, 2018 08:38 AM

రైజిన్స్... కిస్‌మిస్... ఎండు ద్రాక్ష... పేరేదైనా.. ఎలా పిలిచినా వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ద్రాక్ష పండ్లను ఎండబెట్టి వీటిని తయారు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ద్రాక్షలో 80 శాతం పంటను వైన్ తయారీకి, మిగతా దాంట్లో 7 శాతం పంటను ఎండు ద్రాక్షగా మారుస్తారు. మిగిలిన దాన్ని తినడానికి, జ్యూస్‌లకు ఉపయోగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎండు ద్రాక్షను రోజూ గుప్పెడు మోతాదులో తిన‌డం వల్ల మ‌న‌కు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్ పండ్లు తింటే అండాశయంలోని లోపాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది. మహిళలు నిత్యం కిస్‌మిస్‌లను తింటే మూత్రాశయంలో అమోనియా పెరగదు. రాళ్లు కూడా రావు.

2. కిస్‌మిస్ పండ్లను తరచూ తీసుకుంటే శరీరంలో పులుపును స్వీకరించే శక్తి గల ఆమ్లాలు తొలగించబడతాయి. దీని వల్ల జ్వరం రాకుండా ఉంటుంది. 200 ఎంఎల్ పాలతో 50 గ్రాముల కిస్‌మిస్‌లు తింటే నరాల నిస్సత్తువ, రక్తపోటు, ఇతర దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి.

3. కిస్‌మిస్ పండ్లు రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగపడతాయి. 10 కిస్‌మిస్‌లను నీళ్లలో వేసి బాగా ఉడకబెట్టి గుజ్జుగా చేసి తాగితే నరాలకు బలం చేకూరుతుంది. పిల్లలు రాత్రి పూట పక్క తడుపుతుంటే వారికి వారం పాటు ప్రతి రోజూ రాత్రి పూట కొన్ని కిస్‌మిస్ పండ్లను ఇవ్వాలి. దీంతోపాటు ఆ వారం రోజుల్లో వారికి చలవ చేసే వస్తువులైన పెరుగు, మజ్జిగ లాంటి పదార్థాలను ఇవ్వకూడదు. ఈ విధంగా చేస్తే పక్క తడిపే అలవాటు తొలగిపోతుంది.

4. గొంతు వ్యాధితో బాధపడే వారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఇవి శరీరంలోని శ్వాస నాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తాయి. దీంతో ఉపశమనం కలుగుతుంది.

5. మలబద్దకంతో బాధపడేవారు ప్రతి రోజూ రాత్రి పూట పడుకునే ముందు ఎండు ద్రాక్షతోపాటు సోంపును కలిపి తింటే ఉపశమనం లభిస్తుంది.

6. ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీటిలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీని వల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసిపోయి పిల్లలకు పోషకాలు అందుతాయి.

7. ఎండు ద్రాక్షలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీని వల్ల ఇవి రక్తహీనతకు మంచి మందుగా పనిచేస్తాయి. మహిళలకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి.

8. ఒలెనిక్ యాసిడ్ కిస్‌మిస్‌లలో ఉన్నందు వల్ల దంతాల్లో ఉన్న బాక్టీరియా పెరగదు. దీంతో దంతాలు రక్షింపబడతాయి. కళ్ల సంరక్షణకు కిస్‌మిస్ పండ్లు ఉపయోగపడతాయి. బీటాకెరోటిన్, కెరోటినాయిడ్స్‌, పాలీఫినాలిక్ ఫైటో న్యూట్రియంట్స్ వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

9. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వైరస్, బాక్టీరియాలతో పోరాడతాయి. చర్మ వ్యాధులు, ఆర్థరైటిస్, క్యాన్సర్, ట్యూమర్ల వంటి వాటిని రాకుండా చూస్తాయి.

10. ఎండు ద్రాక్షల్లోని కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అధిక శక్తిని పొందడానికి, బరువు పెరిగేందుకు ఇవి చక్కని ఆహారంగా పనిచేస్తాయి.

9182

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles