ఇన్‌ఫెక్ష‌న్ల‌కు చెక్ పెట్టే స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్స్‌..!


Tue,May 15, 2018 05:56 PM

వాంతులు, విరేచ‌నాలు, చ‌ర్మ స‌మ‌స్య‌లు, శ్వాస కోశ స‌మ‌స్య‌లు... ఇలా ఎన్నో ర‌కాల అనారోగ్యాలు మ‌న‌కు బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల వ‌ల్ల క‌లుగుతాయి. కొంద‌రికి జ్వ‌రం ఇంకా ఇత‌ర అస్వ‌స్థ‌త‌లు కూడా క‌లుగుతాయి. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. ఫ‌లితంగా అనారోగ్యం త‌గ్గుముఖం ప‌ట్టేందుకు స‌మ‌యం ప‌డుతుంది. ఈ క్ర‌మంలో హాస్పిట‌ల్‌కు వెళ్లి డాక్ట‌ర్ ఇచ్చిన మందుల‌ను వాడాలి. అయితే అలా కాకుండా అలాంటి బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గాలంటే అందుకు ఇంట్లో ఉండే ప‌దార్థాలే ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. క్రాన్ బెర్రీ జ్యూస్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది. మూత్రాశ‌య‌, వెజైనల్ ఇన్ఫెక్షన్ లు త‌గ్గుతాయి. క్రాన్ బెర్రీ ల‌ను తాజాగా జ్యూస్ లా తయారు చేసి తీసుకోవాలి. రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. క్రాన్ బెర్రీ జ్యూస్‌ హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఇన్ఫెక్షన్స్ తో బాధపడే గర్బిణీలు కూడా క్రాన్ బెర్రీ జ్యూస్ ను తాగొచ్చు. ఈ జ్యూస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

2. టీ ట్రీ ఆయిల్ లో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇందువల్ల అవి బ్యాక్టీరియా, వైర‌స్‌లతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి. టీట్రీ ఆయిల్ లో క‌ల‌బంద గుజ్జును బాగా మిక్స్ చేసి చ‌ర్మం మీద అప్లై చేయాలి. దీంతో వెంటనే చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

3. క‌లబంద‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గిస్తాయి. చ‌ర్మం పాడ‌వ‌కుండా చూస్తాయి. వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

4. యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు వెల్లుల్లిలో అధికంగా ఉండడం వ‌ల్ల అవి ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. రోజుకు ఏదో ఒక విధంగా 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తింటున్నా మంచి ఫ‌లితం ఉంటుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

5. వెల్లుల్లి లాగే తేనె కూడా అద్భుత‌మైన ప్ర‌యోజ‌న‌కారి. ఇందులోనూ యాంటీ వైర‌ల్‌, యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు బాగానే ఉన్నాయి. ఒక గ్లాస్ వేడి నీటిలో తేనెను క‌లిపి రోజూ తాగుతుంటే ఇన్‌ఫెక్ష‌న్ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. తేనెను డైరెక్ట్‌గా చ‌ర్మంపై రాసినా చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చు. తేనె వ‌ల్ల చెడు బ్యాక్టీరియా, వైర‌స్‌లు శ‌రీరం లోప‌లికి చేర‌కుండా ఉంటాయి.

6. జీర్ణాశ‌యం, శ్వాస సంబంధ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను అల్లం మెరుగ్గా త‌గ్గిస్తుంది. ఆయా స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పుడు కొద్దిగా అల్లం ర‌సం తాగితే ఫ‌లితం ఉంటుంది. శ‌రీరంలో ఉన్న వేడిని ఇట్టే దించేస్తుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా న‌శిస్తుంది.

7. యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు బేకింగ్ సోడాలో పుష్క‌లంగా ఉన్నాయి. జీర్ణాశ‌యం, పేగులు, శ్వాస సంబంధ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను బేకింగ్ సోడా త‌గ్గిస్తుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా క‌లుపుకుని తాగితే ఫ‌లితం ఉంటుంది.

8. స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాల‌కు నిమ్మ‌రసం పెట్టింది పేరు. ఇది శ్వాస కోశ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను మెరుగ్గా న‌యం చేస్తుంది. చెడు బ్యాక్టీరియా, వైర‌స్‌ల‌ను అంతం చేస్తుంది. జీర్ణాశ‌య ఇన్‌ఫెక్షన్ల‌ను కూడా నిమ్మ‌ర‌సంతో త‌గ్గించుకోవ‌చ్చు. విట‌మిన్ సి ఉండ‌డం వ‌ల్ల బ్యాక్టీరియాలు, వైర‌స్‌లు న‌శిస్తాయి. లివ‌ర్ క్లీన్ అవుతుంది. ఆస్త‌మా వంటి వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

9. మ‌నం నిత్యం వంట‌ల్లో ఎక్కువ‌గా వాడే ప‌సుపులో ఉన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఆక్సిడెంట్ ల‌క్ష‌ణాల‌కు ప‌సుపు పెట్టింది పేరు. గాయాల‌పై ప‌సుపును రాస్తే వెంట‌నే అవి త‌గ్గుతాయి. యాంటీ సెప్టిక్ ల‌క్ష‌ణాలు ఉండ‌డం వ‌ల్ల గాయం త్వ‌ర‌గా మానుతుంది. శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ప‌సుపును పాల‌లో క‌లిపి తీసుకోవాలి. జీర్ణాశ‌య స‌మ‌స్య‌లు ఉంటే గోరు వెచ్చ‌ని నీటితో క‌లిపి దీన్ని తీసుకోవాలి. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

10. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌లో అధికంగా ఉన్నాయి. శ‌రీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా, వైర‌స్‌ల‌ను ఇది నిర్మూలిస్తుంది. చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. జీర్ణాశ‌య ఇన్‌ఫెక్ష‌న్ల‌ను పోగొడుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.

3461

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles