ఈ మొక్క ఇంట్లో ఉంటే.. అనారోగ్యాలు హుష్ కాకి..!


Thu,May 18, 2017 01:19 PM

ఈ భూ ప్ర‌పంచంపై పెరిగే ప్ర‌తి మొక్క‌, వృక్షం ఏదైన‌ప్ప‌టికీ ప్ర‌తి ఒక్క దాంట్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. కానీ మ‌న‌కు అలాంటి ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌ల గురించి దాదాపుగా తెలియ‌దు. అవి మ‌న చుట్టూ ఉంటాయి, కానీ వాటిని మ‌నం గుర్తించ‌లేం. అలాంటి మొక్క‌లో స‌ర‌స్వ‌తి మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌న ప‌రిస‌రాల్లోనే దొరుకుతుంది. దీన్ని పెంచ‌డ‌మూ తేలికే. ఈ మొక్క‌ను బ్రాహ్మి మొక్క అని కూడా పిలుస్తారు. ఈ క్ర‌మంలో స‌ర‌స్వ‌తి మొక్క ఇంట్లో ఉండ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పేరుకు త‌గిన‌ట్టుగానే స‌ర‌స్వ‌తి మొక్క ఆకులు మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌ర‌చ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయి. నిత్యం 4 స‌ర‌స్వ‌తి ఆకుల‌ను అలాగే నమిలి తింటుంటే మేథ‌స్సు పెరుగుతుంది. మాన‌సిక ఒత్తిడి కూడా త‌గ్గుతుంది.

2. పాఠ‌శాల‌కు, క‌ళాశాల‌ల‌కు వెళ్లి చ‌దువుకునే విద్యార్థులు ఆ మొక్క ఆకుల‌ను బాగా న‌లిపి ర‌సం తీసి దాన్ని పాల‌లో క‌లుపుకుని నిత్యం తాగితే వారి జ్ఞాప‌క‌శ‌క్తి వృద్ధి చెందుతుంది. చ‌దువు బాగా వ‌స్తుంది.

3. ప‌చ్చ కామెర్లు వ‌చ్చిన వారికి ఈ మొక్క ఆకుల నుంచి తీసిన ర‌సాన్ని నిత్యం తాగిస్తుంటే వెంట‌నే కోలుకుంటారు.

4. స‌ర‌స్వ‌తి ఆకుల ర‌సాన్ని నిత్యం తాగుతుంటే ఆయుష్షు పెరుగుతుంది.

5. ఈ మొక్క ఆకుల నుంచి తీసిన ర‌సం రక్తాన్ని శుభ్ర ప‌రుస్తుంది.ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె సంబంధ వ్యాధులు రావు.

6. కొంత వామును తీసుకుని పొడి చేసి దాంట్లో స‌ర‌స్వతి మొక్క ఆకుల ర‌సాన్ని క‌లిపి తీసుకుంటుంటే కొలెస్ట్రాల్ త‌గ్గిపోతుంది. దీని వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. మ‌ధుమేహం కూడా అదుపులోకి వ‌స్తుంది.

7. ఈ మొక్క‌ల ఆకుల‌ను మ‌జ్జిగ‌లో 3 రోజులు నాన‌బెట్టి ఎండించి పొడి చేయాలి. దీన్ని రోజూ టానిక్‌లాగా పిల్ల‌ల‌కు ఇవ్వాలి. దీంతో వారికి బ‌లం బాగా చేకూరుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

8. స‌ర‌స్వ‌తి మొక్క ఆకుల‌ను నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేసి దాంతో తేనెను క‌లిపి తీసుకుంటే గొంతు బొంగురు త‌గ్గుతుంది. స్వ‌ర‌పేటిక వృద్ధి చెంది మంచి కంఠ స్వ‌రం కూడా క‌లుగుతుంది.

9. సరస్వతీ ఆకులను నీడలో ఎండబెట్టాలి. అయిదు బాదంపప్పులు, రెండు మిరియాలు, వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా రుబ్బాలి. తరువాత దానిని పలుచని వస్త్రంతో వడకట్టి, తగినంత తేనె కలిపి 40 రోజులపాటు రోజు ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ ఔషధాన్ని మాటలు సరిగ్గా రాని పిల్లలకు వాడుతారు. నత్తిని తగ్గించే శక్తి దీనికి ఉంది.

10. పైన చెప్పిన అనారోగ్య స‌మ‌స్య‌ల‌కే కాదు స‌ర‌స్వ‌తి మొక్కను పెంచ‌డం వ‌ల్ల అన్ని ర‌కాల అరిష్టాలు పోతాయ‌ట‌. అంతా శుభమే క‌లుగుతుంద‌ని హిందువులు న‌మ్ముతారు.

4889

More News

VIRAL NEWS