ఔషధ గుణాలున్న కాకర


Mon,July 31, 2017 11:46 AM

కాకరకాయ చూడగానే అబ్బో.. చేదు అని ముఖం చిట్లించుకుంటాం. మరికొందరు నచ్చక పోయినా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తింటారు. దాని విలువ తేలిసిన వారే ఇష్టంగా ఆరగిస్తారు. ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలున్న కాకర రక్తపోటు, కంటి కమస్యలను నివారిస్తుంది. మధుమేహం, మొలలు, మలబద్ధకాన్ని అరికడుతుంది. శరీరంలో వ్యర్థాలను తొలగించేందుకు దోహదపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపర్చి చర్మవ్యాధులను దూరం చేస్తుంది. ఒకప్పుపడు పల్లెల్లో ప్రతి ఇంటి పెరట్లోను కాకరకాయ తీగలతో పొదలుండేవి. ప్రత్యేకంగా పందిరి వేసి పేంచేవారు. కాకరకాయ పుట్టింది మన దేశంలోనైనా దానిలోని విశేష గుణాలు తెలిశాక ఇతర దేశాల వారు కాకరకాయను సాగు చేస్తున్నారు.

కాకరకాయలతో ఇవీ లాభాలు..
* కాకరకాయలో విటమిన్ ఏ, బీ1, బీ2, సీ ఉంటాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్ లభిస్తాయి. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కాపదోశ నివారిణిగా కాకరకాయకు గుర్తింపుంది.
* రక్త కణజాలాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయాన్ని ఉత్తేజ పరుస్తుంది. స్కిన్‌పైనా ప్రభావం చూపుతుంది.
* ఆకలిని పెంచే శక్తి కాకరకు ఉంది. ఉదరానికి మంచిది. శరీరంలోని చిన్నిచిన్న వాపులను తగ్గించి అంతర్గత గాయాలను మాన్పుతుంది.
* శరీరానికి పట్టిన అధిక నీటిని తొలగిస్తుంది. అధిక రక్తపోటు, కంటి సమస్యలను, నాడీ సంబంధిత ఇబ్బందుల నుంచి దూరం చేస్తుంది. పిండి పదార్థాలు జీర్ణంలో కలిగే మార్పులను సరిదిద్దుతుంది.
* రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో ైగ్లెకోసైడ్‌లు, ఫీనోలిక్స్, అల్కలాయిడ్స్, తైలాలు, ప్రీయాసిడ్స్, పాలిపప్టైడ్‌లు, 17 రకాల ఆమైనో ఆమ్లాలు లభిస్తాయి.
* మధుమేహ వ్యాధి విరుగుడుకు కాకరను వాడుతారు. కాకరలో ఇన్సూలిన్ ఉంది. దీని ప్రభావంతో రక్తం, మూత్రంలో చేరిన చక్కెర అధిక నిల్వలు తగ్గుతాయి. ఇందు కోసమైనా కాకరను ఆహారంలో తరుచూ తీసుకోవాలి.
* మధుమేహ వ్యాధి వారు మందుగా ప్రతిరోజూ ఉదయం పరిగడుపున కాకరకాయ రసం తాగాలి. కాకర విత్తనాలను పొడిచేసి ఆహారంపై చల్లుకొని తినవచ్చు.
* లేత కాకరకాయ ఆకుల రసం మొలలు (పైల్స్)కి విరుగుడుగా పనిచేస్తుంది. రోజూ ఉదయం మూడు చెంచాల తాజా కాకరకాయ రసాన్ని గ్లాసు మజ్జిగలో కలుపుకొని తాగాలి. ఇలా నెల రోజులు చేస్తే మొలలు తగ్గుతాయి.
* కాకర వేర్లను మెత్తగా నూరి ముద్ద చేసి మొలలపై రాస్తే ఉపశమనం ఉంటుంది. మొలల పదార్థానికి విరుగుడుగా పనిచేస్తుంది.
* కడుపులో గ్యాస్ రానియ్యకుండా కాకరకాయ దోహద పడుతుంది. అదనంగా చేరిన పసరు రక్తంలోని మలినాలను తొలగిస్తుంది.
* రక్తపు గడ్డలకు, దురదలు, గజ్జి, తామర, ఫంగస్ వ్యాధులన్నింటికీ కాకర మందుగా పనిచేస్తుంది. కప్పు తాజా కాకర రసంలో చెంచాడు నిమ్మరసం కలిపి రోజూ పరిగడుపున తాగితే చర్మవ్యాధులు తగ్గుతాయి.
* కాకర వేర్లను మెత్తగా నూరి ముద్దగా చేసి చెంచాడు తేనెతో కలిపి రోజూ రాత్రిపూట తీసుకుంటే ఆస్తమా, జలుబు, శ్వాసనాళ ఇబ్బందులు తొలగిపోతాయి.

5239

More News

VIRAL NEWS

Featured Articles