పొట్టలోన చూడు పురుగులుండు..!


Thu,August 10, 2017 11:15 AM

పిల్లల పొట్టలో తిష్టవేసి, పోషకాలను ఆరగిస్తూ, ఆరోగ్యాన్ని హరించే
నులిపురగులపై ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని వైద్యులు సూచిస్తున్నారు.
అవి బాలల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారవచ్చునని
హెచ్చరిస్తున్నారు. ఈ నెల 10న నులిపురుగుల నివారణ కోసం
అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నారు. అదే రోజు జరుపు
కోనున్న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా
ప్రత్యేక కథనం.

చిన్నారులు మట్టిలో ఆడి, చేతులు కడగకుండా భోజనం చేసినప్పుడు అందులో ఉండే రకరకాల నులిపురుగుల లార్వాలు నోటి ద్వారా కడుపులోకి ప్రవేశిస్తాయి. పేగుల్లో పూర్తిస్థాయి నులిపురగులుగా అభివృద్ధి చెంది. అక్కడే తిష్టవేస్తాయి. 19 ఏళ్లలోపు చిన్నారులు, బాలబాలికల ఆరోగ్యంపై ఈ నులిపురుగలు తీవ్ర ప్రభావం చూపుతాయి. వీరు తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగదల నిలిచిపోయి వివిధ రోగాల బారిన పడుతారు. ఆకలి మందగించి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.

మూడు రకాల పురుగులు ..
పిల్లల పేగుల్లో సాధారణంగా మూడు రకాల పురుగులు తిష్ట వేస్తాయి. వీటిలో ఏలిక పాములు (ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్), కొంకి పురుగు ( ఆంకైలోస్టోమా డియోడెనేల్), చుట్టపాములు (టీనియా సోలియం) అనే మూడు రకాలుంటాయి. ఈ నులిపురుగులు 55 అడుగుల (17 మీటర్ల) దాకా పెరిగి 25 ఏళ్ల దాకా బతుకుతాయి. వీటి గుడ్లు మట్టిలో 10 ఏళ్లకు పైగా దెబ్బతినకుండా ఉంటాయి. సరిగ్గా ఉడికించని పంది, గొడ్డు మాంసాల ద్వారా చుట్టుపురుగులు కడుపులోకి చేరుతాయి. మట్టిలో ఆడితే పాదాల ద్వారా కొంకి పురుగుల లార్వాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

ఇలా వ్యాప్తి చెందుతాయి..
* పరాన్న జీవులైన నులి పురుగులు, కొంకి పురుగులు, నట్టలు మనిషి పేగులను ఆవాసంగా చేసుకుంటాయి.
* ఇవి వేల సంఖ్యలో గుడ్లు పెడతాయి. అవి మల విసర్జన ద్వారా బయటకొస్తాయి. బహిరంగ మల విసర్జన ద్వారా మన చుట్టూ పరిసరాల్లో ఈ గుడ్లు వ్యాపిస్తాయి.
* మట్టిలో కలిసిపోయిన గుడ్లు తీవ్ర వాతావరణాన్ని సైతం తట్టుకుని, రెండేళ్ల వరకు అలాగే ఉంటాయి.
* మట్టిలో ఆడుకునే ఐదు నుంచి 18 ఏళ్ల వారిపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చేతులను శుభ్రం కడుక్కోకపోవడం, ఆటలు ఆడొచ్చి అలాగే భోజనం చేయడం ద్వారా ఈ పరాన్నజీవులు కడుపులోకి చేరతాయి.

చేతుల శుభ్రతతో పరిష్కారం
* భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
* చేతుల పైభాగం నుంచి అరచేతి వరకూ శుభ్రం చేసుకోవాలి.
* పాదరక్షలు లేకుండా తిరిగితే కొంకి పురుగుల లార్వాలు అరికాలిలోకి చీల్చుకుని ప్రవేశిస్తాయి.

ఆహార శుభ్రతా అవసరమే..
కూరగాయలు, ఆకుకూరలు కూడా వీటి గుడ్లతో కలుషితమవుతున్నాయి. కావున కొంచెం ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేస్తే నులి పురుగుల లార్వాలతో పాటు వాటిపై ఉండే వ్యర్థాలు తొలగిపోతాయి. వండిన ఆహార పదార్థాలను సాధ్యమైనంత వరకు వేడిగా తినడం మంచిది. పదార్థాలపై ఈగలు వాలకుండా మూతలు పెట్టాలి. శుద్ధి చేయని నీటిని తాగరాదు.

ఆల్బెండజోల్‌తో విరుగుడు..
400 మిల్లీగ్రాముల అల్బెండజోల్ మాత్రలను ప్రతి విద్యార్థి భోజనం చేసిన తరువాత బాగా నమిలి మింగాలి. దీని వల్ల కడుపులోని అన్ని రకాల పరాన్న జీవులు ( నులిపురుగులు) చనిపోతాయి. ఐదు నుంచి 18 ఏళ్ల వయసు ఉన్నవారంతా ప్రతి ఆరునెలలకోసారి అల్బెండజోల్ మాత్ర వేసుకోవాలి. ఖాళీ కడుపుతో ఈ మాత్రలు వేసుకోకూడదు.

రేపే మాత్రల పంపిణీ..
నులిపురుగుల నియంత్రించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1 నుంచి 19 ఏళ్లలోపు బాలబాలికలందరికీ గురువారం జిల్లా వ్యాప్తంగా అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నారు. చిన్నారులందరికీ తప్పనిసరిగా వీటిని వేయించాలని ఆయాశాఖల అధికారులు సూచిస్తున్నారు.

అనేక ఆరోగ్య సమస్యలు..
ప్రతి 19 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ నులిపురుగు నివారణ మా త్రలు (అల్బెండజోల్) వేయించాలని జాయింట్ కలెక్టర్ పద్మాకర్ అన్నారు. నులి పురుగుల నిర్మూలన అవగాహన ర్యాలీని జి ల్లా వైద్యాధికారి ప్రవీణ్‌చందర్‌తో కలిసి జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నులిపురుగుల దినోత్స వం నిర్వహిస్తుందన్నారు. నులిపురుగులు కడుపులో ఉండడం వల్ల రక్తహీనత, కడుపునొప్పి, వా ం తులు కావడం, త్వరగా అలిసిపోవ డం వంటి ఇబ్బందులు పిల్లలకు ఏ ర్పడుతాయన్నారు. ఒకటి నుంచి రెండు సంవత్సరాల్లోపు వారికి స గం అల్బెండజోల్ మాత్రను నీ టిలో కలిపి తాగించాలన్నారు. రెం డు నుంచి 19 సంవత్సరాల వయస్సులోపు వారికి 400 మిల్లీగ్రాముల మాత్రలను వేసుకోవాలని, మాత్ర వేసుకునేటప్పుడు కొరికి న మిలి మింగాలని సూచించారు. దీని వల్ల బుద్ధిమాంద్యం పోయి మెదడు చురుకుగా పనిచేస్తుందన్నారు. వి ద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు పా ఠశాల, అంగన్‌వాడీ కే ంద్రాల్లోను, కళాశాలల్లోను ఈ మా త్రలను వే యించాలన్నారు.

7559

More News

VIRAL NEWS

Featured Articles