కాకరకాయలో బోలెడు ఔషధ గుణాలు


Sat,August 19, 2017 07:53 AM

కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది ఇష్టపడరు. కానీ కాకరని తినడం మానేస్తే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.

కాకరకాయలో బోలెడు ఔషధ గుణాలున్నాయి. బ్రొకోలీ కంటే రెండింతల బీటా కెరోటిన్ కాకరలో ఉంది. ఇది శరీరానికి విటమిన్ ఎ అందిస్తుంది. ఇందులో క్యాల్షియం కూడా అధికం. ఎముకలు, దంతాలకు కాకర వల్ల బలం చేకూరుతుంది. ఇందులోని పొటాషియం నరాల వ్యవస్థకు మేలు చేస్తుంది. హృద్రోగానికి దూరం చేస్తుంది. కాకరలోని చారన్టిన్ అనే ధాతువులు రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి. చక్కెర వ్యాధిగ్రస్తుల్లో ఇన్సులిన్‌ని పెంచుతుంది కాకర. విటమిన్ బి1, 2, 3, సి, మెగ్నీషియం, ఫొలేట్, పాస్పరస్, మాంగనీస్, పీచు వంటి ఎన్నో పోషకాలు కాకరలో ఉన్నాయి. వారానికోసారి కాకర జ్యూస్ తాగడం వల్ల ఉదర సమస్యలను దూరం చేసుకోవచ్చు. కాకర గింజలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అనవసర కొవ్వును కరిగిస్తాయి. కాకర జ్యూస్, నిమ్మరసంతో కలిపి పరగడుపున తీసుకుంటే మొటిమలుండవు. చర్మవ్యాధులు నయమవుతాయి. కాకర రసాన్ని జీలకర పొడితో రుబ్బుకొని మాడుకు రాస్తే చుండ్రు పోతుంది. కాకర రసం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

3974

More News

VIRAL NEWS

Featured Articles