‘నా పేరు సూర్య’ హీరోయిన్ ఎవరో ?

Mon,June 19, 2017 05:26 PM
‘నా పేరు సూర్య’ హీరోయిన్ ఎవరో ?


హైదరాబాద్: డీజే రిలీజ్‌కు ముందే ‘నా పేరు సూర్య’ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు టాలీవుడ్ ైస్టార్ అల్లు అర్జున్. ఈ స్టార్ లేటెస్ట్ ప్రాజెక్టులో హీరోయిన్‌గా కన్నడ నటి రష్మికను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే చిత్రయూనిట్ రష్మికకు బదులు మరో హీరోయిన్‌ను వెతికే పనిలో పడిందని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీలో నటించే విషయంపై ఇప్పటికే నిర్మాతలు నివేధాథామస్‌ను కూడా సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న నా పేరు సూర్య సినిమాకు బాలీవుడ్ కంపోజర్స్ విశాల్-శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2018 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది.

2054

More News

VIRAL NEWS