హృతిక్ తో జతకట్టేదెవరు?

Sun,March 19, 2017 11:13 AM
హృతిక్ తో జతకట్టేదెవరు?

బాలీవుడ్ హ్యండ్సమ్ హీరో హృతిక్ రోషన్ ఈ మధ్య కాబిల్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హృతిక్ అంధుడిగా కనిపించి మెప్పించాడు. ఇక ఇప్పుడు హృతిక్ తర్వాత సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కబీర్ దర్శకత్వంలో హృతిక్ తన తదుపరి చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తుండగా ఈ చిత్రంలో కథానాయికలుగా దీపిక పదుకొణే లేదా కత్రినా కైఫ్ ని తీసుకోవాలా అనే ఆలోచనలో టీం ఉందట. కాకపోతే కబీర్ తన చిత్రానికి ఫ్రెయి పెయిర్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. కాగా కత్రినా కైఫ్ దర్శకుడికి చాలా క్లోజ్, వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఈ కారణం వలన హృతిక్ సరసన నటించే ఛాన్స్ కత్రినాకి ఇస్తాడా అనే టాక్ కూడా ఉంది. కాని హృతిక్ తో కత్రినా ఇప్పటికే నటించింది. దర్శకుడు ఫ్రెష్ పెయిర్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్న నేపథ్యంలో తన సినిమాలో హృతిక్ సరసన నటించే ఛాన్స్ ఈ ఇద్దరికి దక్కకపోవచ్చనే టాక్ నడుస్తుంది.

1704

More News

VIRAL NEWS