‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వెనక అసలు నిజం చెప్పిన వ‌ర్మ

Fri,February 15, 2019 04:21 PM
voice msg as asked by NTR to be given to everyone on the reason behind making

హైద‌రాబాద్‌: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీయడం వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీయడం వెనక ఉన్న కార‌ణాన్ని ప్రజలకు చెప్పాలని ఎన్టీ రామారావు గారు తనను అడిగారని రామ్ గోపాల్ వర్మ ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఈ మేరకు ఆయన వాయిస్ మెసేజ్‌ను యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు.

ఎన్టీఆర్ 1989 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి, అధికారం కోల్పోయిన సమయం నుంచి జ‌రిగిన సంఘ‌ట‌న‌లు వ‌ర్మ ఈ వీడియోలో ప్ర‌స్తావించారు. పాతికేళ్లుగా నిజాలుగా చెలామణి అవుతున్న సిగ్గులేని అబద్ధాలను శాశ్వతంగా నిజం అనబడే గోతిలో పాతిపెట్టడం ఈ సినిమా ఉద్దేశం అని వర్మ వివరించారు. ఈ సినిమా ప్రమోషన్ పనులను కూడా వర్మ ఇప్పటికే మొదలు పెట్టారు. తాజాగా ఈయ‌న విడుద‌ల చేసిన వాయిస్ వీడియో కూడా సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

3506
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles