‘నేను ఎవరన్నది..నేను చెప్పేది కాదు’

Sun,August 20, 2017 10:42 PM
vivekam movie trailer revealed


హైదరాబాద్: కోలీవుడ్ స్టార్ అజిత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వివేగం. తెలుగులో వివేకం పేరుతో విడుదలవుతున్నది. శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ‘నేను ఎవరన్నది ఎప్పుడూ నేను నిర్ణయించి చెప్పేది కాదు..నా ఎదురుగా ఉన్నవాళ్ల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది’ అంటూ అజిత్ చెప్పిన డైలాగ్స్ మూవీపై క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. హాలీవుడ్ మూవీకి ఏ మాత్రం తీసిపోని విధంగా వివేకం ట్రైలర్‌ను రెడీ చేశారు నిర్మాతలు. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో అజిత్ కు జోడీగా కాజల్ నటిస్తోంది. ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకురానుంది.

2002
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS