అభిమానుల త‌ర‌పున పోలీసుల‌కి క్ష‌మాప‌ణ‌లు తెలిపిన విజ‌య్

Thu,March 21, 2019 08:53 AM
vijay says sorry to traffic police

అర్జున్ రెడ్డి సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న కుర్ర హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు బిజినెస్ కార్య‌క్ర‌మాలు కూడా చేప‌డుతున్నారు విజ‌య్. రౌడీ పేరుతో వ‌స్త్ర బ్రాండ్‌ని విజ‌య్ మార్కెట్‌లోకి తీసుకు రాగా, దీనికి అమిత‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. కుర్ర‌కారు అంతా రౌడీ పేరుతో ఉన్న టీష‌ర్ట్స్‌ని ధ‌రిస్తూ త‌మ హీరోపై ఉన్న అభిమానం చాటుకుంటున్నారు. ఇక కొంద‌రైతే రౌడీ సింబ‌ల్‌ని బైక్ నెంబ‌ర్ ప్లేట్స్‌పై కూడా వేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు రౌడీ నంబర్ ప్లేట్ ఉన్న ఓ వాహనాన్ని పట్టుకొని జరిమానా విధించి, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న అభిమానుల త‌ర‌పున క్ష‌మాప‌ణ‌లు తెలుపుతున్నాన‌ని బ‌దులిచ్చాడు. వారిలో చైత‌న్యం తెచ్చి ఇంకోసారి ఇలాంటి జ‌ర‌గ‌కుండా చూస్తాన‌ని అన్నారు.

మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ట్విట్ట‌ర్‌లో అభిమానుల‌నుద్దేశించి ఓ పోస్ట్ పెట్టాడు. మిమ్మ‌ల్ని స్పోర్ట్ రౌడీగా చూసిన‌ప్పుడు మీరంతా నా ఫ్యామిలీ అనుకున్నాను. నా పై చూపిస్తున్న ప్రేమ‌కి కృత‌జ్ఞ‌త‌లు. నా ఫ్యామిలీకి సంబంధించిన వారెవ‌రైన క‌ష్టాల‌లో ఇరుక్కోవ‌డం నేను చూడ‌లేను. కొన్ని రూల్స్ మ‌నం త‌ప్ప‌క పాటించాలి. ఆ రూల్స్ మ‌న మంచి కోసం పెట్టిన‌వే. మీ ప్రేమ‌ను ఎవ‌రిపైన అయిన చూపించండి. బైక్ పైన ఎక్క‌డైన చూపించండి, కాని కానీ నంబర్ ప్లేట్స్‌పై మాత్రం వాహన నంబర్‌నే ఉంచండి’’ అని విజయ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపించారు. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ‘‘నువ్వు ఆన్ స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లోనూ రియల్ హీరోవే. నేను మీ సామాజిక స్పృహను అభినందిస్తున్నాను’ అని ట్విటర్ ద్వారా అభినందించారు.3209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles