వారిద్దరిని గుర్తించ‌డంలో సాయం చేయండి : వ‌ర్మ‌

Sun,January 20, 2019 12:38 PM
varma post huge viral in social media

సంచ‌ల‌న ద‌ర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌కి వివాదాలు కొత్తేమికాదు. ఆయ‌న ముఖ్యంగా వివాదాలతోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ల‌క్ష్మీ పార్వ‌తి జీవిత కోణం నుండి ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నాడు వ‌ర్మ‌. ఈ సినిమాకి సంబంధించిన తొలి పోస్ట‌ర్‌తోనే వివాదాలు రేపిన వ‌ర్మ ఇటీవ‌ల వెన్నుపోటు అనే సాంగ్ విడుద‌ల చేశాడు. ఈ సాంగ్‌పై పలు అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. ఇక ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా వెన్నుపోటు ద్వారా చంపబడిన ఎన్టీఆర్ మళ్లీ లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపంలో బతికి వ‌చ్చారంటూ ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశాడు. ఇక‌ తాజాగా బాహుబ‌లి చిత్రంలో బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప వెన్నుపోటు పొడిచిన పోస్ట‌ర్‌ని కాస్త మార్ఫింగ్ చేసి ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటోలోని వ్య‌క్తులు నాకు స‌రిగా గుర్తు రావ‌డం లేదు.వారెవ‌రో గుర్తించ‌డంలో కాస్త సాయం చేయండి అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వర్మ స్యయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్రల్లో యాగ్న శెట్టి, శ్రీతేజ్‌లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కళ్యాణ్ మాలిక్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.



5252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles