మోదీ బయోపిక్‌ పోస్టర్‌ విడుదల చేసిన గడ్కరీ, వివేక్‌ ఒబెరాయ్‌

Mon,May 20, 2019 12:52 PM
Union Minister Nitin Gadkari and actor Vivek Oberoi launch poster of biopic 'PM Narendra Modi'

నాగ్‌పూర్‌: ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోదీ’. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌.. మోదీ పాత్ర పోషిస్తున్నారు. మేరీకోమ్‌, సరబ్‌జిత్‌ వంటి చిత్రాలు తీసిన ఒముంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. తాజాగా సినిమా పోస్టర్‌ను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వివేక్‌ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు అన్ని బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌పై మేమంతా ఆనందంగా ఉన్నాం. కొద్దిరోజుల క్రితం బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయని మాట్లాడారు. కానీ, మేమెప్పుడూ భయపడలేదు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనూ ప్రధాని మోదీపై ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయత వెలకట్టలేనిది.అని ఒబెరాయ్‌ పేర్కొన్నారు.

మోదీ రాజకీయ జీవితం ఆరంభమైనప్పటి నుంచి 2014లో ఆయన ప్రధాని అయ్యే వరకూ.. అనేక అంశాలు, విశేషాలు సినిమాలో ఉంటాయి. ఈ సినిమాను సార్వత్రిక ఎన్నికలకు ఒక రోజు ముందు విడుదలవుతోందని .. ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందని ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను మే 24న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.1115
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles