కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి బర్త్ డే విషెస్

Sun,March 19, 2017 10:36 AM
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి బర్త్ డే విషెస్

నటులలో కొందరు విలక్షణ నటులుంటారు. అలాంటి విలక్షణ నటుడు మోహన్ బాబు. ఆయన కేవలం హీరో రోల్స్ కే పరిమితం కాలేదు. విలన్ గా, హీరోగా, కేరక్టర్ ఆర్టిస్టుగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ప్రతి నటుడికీ సొంత శైలి అవసరం. మోహన్ బాబు కూడా నటనలో తనదైన శైలి చూపించి మెప్పిస్తున్నాడు. ఎంత కఠినమైన, సుదీర్ఘమైన డైలాగ్ అయినా అలవోకగా చెప్పడం మోహన్ బాబు స్పెషాలిటీ.

మోహన్ బాబు డైలాగ్ డెలివరీలో ఒక రకమైన విరుపు, చివరలో కాస్త మలుపు ఉంటాయి. ఆయన నటనలో ఓ రకమైన ఠీవి ఉంటుంది. కొన్ని కేరక్టర్స్ లో కాస్త సరదాగా మనకు కితకితలూ పెడతాడు ఈ నటప్రపూర్ణ. ఈ లక్షణాలే మోహన్ బాబు సినిమాల్ని హిట్ పెరేడ్ చేయించాయి. అందుకే ఆయనను కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అంటారు. చాలామందిలాగే మోహన్ బాబు కూడా సినిమాల్లోకి రావడానికి మొదట్లో చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాడు.

1952 మార్చి 19న చిత్తూరు జిల్లా మోదుగుల పాలెంలో పుట్టిన మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. యేర్పేడు, తిరుపతి, చెన్నైల్లో చదివిన తర్వాత ఓ స్కూల్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ స్ట్రక్టర్ గా కొంతకాలం పనిచేశాడు మోహన్ బాబు. కానీ సినిమాల్లో చేరాలనే కోరిక బలంగా ఉండేది. సినిమాల్లోకి రావడానికి మొదట్లో ఎన్నో కష్టాలు పడిన మోహన్ బాబుకి 1975లో దాసరి నారాయణరావు 'స్వర్గం నరకం' లో ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా విజయంతో మోహన్ బాబు ఇక తన కెరీర్ లో వెనకడుగు వేయలేదు.

నటనలోనూ, డైలాగ్ డెలివరీలోనూ ఒక ఒరవడి క్రియేట్ చేశాడు కనకనే పరిశ్రమకొచ్చి 40 ఏళ్లు దాటినా ఇంకా మెరుపులు మెరిపిస్తున్నాడు మోహన్ బాబు. ఆయనకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం.

1324

More News

VIRAL NEWS