అన్నా డీఎంకే విలీనంపై క‌మ‌ల్‌హాస‌న్ సెటైర్లు

Mon,August 21, 2017 03:50 PM
They are fooling the People says Kamal Haasan on AIADMK merger

చెన్నై: అన్నాడీఎంకే రెండు వ‌ర్గాల విలీనంపై సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ త‌న‌దైన స్టైల్లో సెటైర్ వేశారు. ప్ర‌జ‌ల‌ను పిచ్చోళ్ల‌ను చేస్తున్నార‌ని అత‌ను ట్వీట్ చేశాడు. త‌మిళుల త‌ల మీద గాంధీ టోపీ, కాషాయ టోపీ, క‌శ్మీర్ టోపీ.. ఇప్పుడు జోక‌ర్ టోపీ పెట్టారు అని క‌మ‌ల్ అన్నాడు. విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌ల‌వ‌డం అంతా డ్రామా అని క‌మ‌ల్ ఆరోపించాడు. రాష్ట్రంలో అవినీతి, నేరాల‌ను అదుపు చేయ‌డంలో ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని గ‌తంలోనే క‌మ‌ల్ విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. కొంత‌కాలంగా ఏఐఏడీఎంకే మంత్రుల‌తో క‌మ‌ల్ మాట‌ల‌యుద్ధానికి దిగాడు. ప‌ళ‌ని ప్ర‌భుత్వంలోనే అవినీతి బ‌య‌ట‌ప‌డినా.. ఆయ‌న ఎందుకు రాజీనామా చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.


1687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS