శింబు, హన్సికల బ్రేక్అప్ పై క్లారిటి

Tue,September 19, 2017 02:32 PM
t rajendar gives clarity on simbu hansika break up

శింబు హన్సికల ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఘాడంగా ప్రేమించుకున్న ఈ జంట తమ వ్యవహారాన్ని పెళ్లి వరకు తీసుకు వచ్చారు . వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడం ,పెళ్ళిమాటలు కూడా జరిగిపోవడం అంతా కొద్దిరోజుల్లో జరిగింది. కాని సడెన్ గా క్యాన్సిల్ అని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. అందుకు గల కారణాలేంటీ అనేవి కూడా తెలియరాలేదు. ఈ వ్యవహారంపై శింబు తండ్రి టి.రాజేందర్ నోరు విప్పారు.

శింబు,హన్సికల ప్రేమాయణం నిజమేనన్న శింబు తండ్రి వారిరివురు విగడిపోవడానికి గల కారణం హన్సికనే అన్నాడు. పెళ్ళి తర్వాత హన్సికని సినిమాలు చేయోద్దని చెప్పడంతో తన నిర్ణయాన్ని మార్చుకుందని రాజేందర్ అన్నాడు. ప్రస్తుతం తన కొడుక్కి వేరే సంబంధాలు చూస్తున్నామని తెలిపారు టి.రాజేందర్. అయితే చాలా మంది హీరోయిన్లకి పెళ్ళి అనగానే వచ్చే సమస్య ఇదే కాగా, బిజినెస్ పీపుల్‌కి ఇలాంటి కండీషన్ పెట్టినా పర్వాలేదు . కాని సినిమాల్లో నటించే వారికి నటనే ప్రాణం అని తెలిసి నటనను ఆపమనడం హీరోయిన్లకు నచ్చడం లేదు. వివాహాన్నైనా వారు వదులుకుంటున్నారు కాని తమ కెరీర్ ని మాత్రం వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.

1287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS