అక్టోబర్‌లో సెట్స్‌పైకి సైరా నరసింహారెడ్డి..!

Thu,September 21, 2017 03:06 PM
అక్టోబర్‌లో సెట్స్‌పైకి సైరా నరసింహారెడ్డి..!

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 20 నుండి జరగనుందని తాజా సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా, చిరంజీవి తన మేకొవర్‌ని పూర్తిగా మార్చుకుంటున్నాడు. 1840 నాటి కథకి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ హైదరాబాద్‌లో భారీ సెట్ నిర్మిస్తున్నాడు. 2 శతాబ్ధాల పూర్వంకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేవలం పుస్తకాలు, వీడియోలు, చరిత్ర కారుల రిఫరెన్స్ ఆధారంగా పనిచేస్తున్నారు. హైదరాబాద్, పొలాచ్చి, రాజస్థాన్‌లతో పాటు పలు భారీ ప్రాంతాలలో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. పీరియాడియకల్ మూవీగా తెరకెక్కనున్న ఈ విజువల్ వండర్ చిత్రం దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందనుందని తెలుస్తుంది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించనుండగా, డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. రాయలసీమ ప్రాంతంలో ఉయ్యాలవాడ సాహసాలను కీర్తిస్తూ పాడుకునే 'సై రా నరసింహారెడ్డి' అనే పదాలనే చిరు 151వ సినిమా టైటిల్ గా నిర్ణయించిన విషయం విదితమే.

545

More News

VIRAL NEWS