పరీక్షల సీజన్ లో ప్రొడ్యూసర్లకు సినిమా కష్టాలు

Sun,March 19, 2017 09:55 AM
పరీక్షల సీజన్ లో ప్రొడ్యూసర్లకు సినిమా కష్టాలు

ఎండాకాలం వచ్చేసింది. సూర్యుడు చురుక్కనిపిస్తున్నాడు. దాంతో జనం చికాగ్గా ఉండడం సహజం. అయితే .. సినిమా వాళ్లకు కూడా ఎండాకాలం చికాగ్గానే ఉంటుంది. ఎండతో సతమతమవడం ఒకటైతే మరో రకం చికాకు, ఆందోళన కూడా సినిమా వాళ్లకుంటుంది. వాళ్లకేం హాయిగా ఏసీ ఇళ్లలో కూచుంటారు. ఇక టాప్ స్టార్స్ అయితే ఎండాకాలం షూటింగ్స్ పెట్టుకోరు. ఫారిన్ ట్రిప్స్ కొడుతుంటారు. మరి ఏంటి ప్రాబ్లెమ్ అనొచ్చు. కానీ సినిమా వాళ్లకు వేరో మరో సమస్య ఉంది.

ఎండాకాలంలో అందరికీ ఎండ సమస్య అయితే, సినిమా వాళ్లకు పరీక్షల దెబ్బ సమస్య ఉంది. మార్చి , ఏప్రిల్ నెలలు అన్ని కోర్సుల స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్ సీజన్. ఏడాదిలో ఎన్నడూ చదవని వాళ్లు కూడా ఈ రెండు నెలలూ పుస్తకాల పురుగులై పోతారు. అదివరకు జాలీగా గాళ్ ఫ్రెండ్ తోనో, బాయ్ ఫ్రెండ్ తోనో సినిమాలకూ, షికార్లకూ చక్కర్లు కొట్టేవాళ్లు కూడా బుక్స్ మంతులైపోతారు.

స్టూడెంట్స్ కే కాదు ఎగ్జామ్స్ .. సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకు కూడా పరీక్షలే. వాళ్లకేం పరీక్షలంటారా? ఈ రెండు నెలలూ స్టూడెంట్స్ సినిమాలు తగ్గించేస్తారు కదా .. మరి మూవీస్ కలెక్షన్స్ కూడా తగ్గిపోతాయి. కష్టపడి .. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినా పరీక్షల సీజన్ ఎండ్ అయ్యే దాకా రిలీజ్ చేయకుండా వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి ఇది వాళ్లకు పరీక్షే కదా ..

విద్యార్థుల పరీక్షల ప్రభావం సినిమా ఇండస్ట్రీ పై చాలానే ఉంటుంది. కలెక్షన్ల విషయంలో ఒక అంచనా వేసుకుని రిలీజ్ చేసిన సినిమా కాస్త బొక్కా బోర్లా పడుతుంది. కోట్ల రూపాయల నష్టం వస్తుంది. రిలీజ్ చేయకుండా ఆగుదామా అంటే ప్రొడ్యూసర్లు వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది. సినిమాలకు మహారాజ పోషకులు స్టూడెంట్సే కాబట్టి నిర్మాతలు వాళ్లమీదే డిపెండ్ కాక తప్పదు. పరీక్షల శ్లాక్ సీజన్ ఎండ్ అయ్యేదాకా ఈ సినిమా కష్టాలు తప్పవు మరి.

1127

More News

VIRAL NEWS