ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి చెప్పిన రాజమౌళి

Mon,February 18, 2019 07:20 PM

బాహుబలి, బాహుబలి 2 తర్వాత దర్శకుడు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రాంచరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రాజెక్టు రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది. తర్వాత దుబాయ్‌ లో మూడో షెడ్యూల్‌ జరుపుకోనుంది. బాహుబలి తర్వాత జక్కన్న తీయబోతున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అభిమానులను ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ కు సంబంధించి ఏ విషయం బయటకు రానివ్వకుండా చూసుకున్న దర్శకుడు..ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయంపై అభిమానులకు స్పష్టత ఇచ్చాడు.

హార్వర్డ్‌ యూవవర్సిటీలో ‘ఇండియా ఎట్‌ యాన్‌ ఇన్‌ఫ్లెక్షన్‌ పాయింట్‌ థీమ్‌’ నేపథ్యంలో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్‌ 2019కు రాజమౌళి హాజరయ్యాడు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ..ఆర్‌ఆర్‌ఆర్‌ పాన్‌ ఇండియా సినిమా అని చెప్పాడు. బాహుబలి సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా జక్కన్న ఎవరిని ఎంపిక చేస్తారనేది తెలియాల్సి ఉంది.

4863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles