ఐస్‌ల్యాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న సౌంద‌ర్య‌, విశాగ‌ణ్‌

Sat,February 16, 2019 11:41 AM
Soundarya Rajnikanth And Vishagan Vanangamudi Are Honeymooning

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చిన్న కూతురు సౌంద‌ర్య వివాహం ఫిబ్ర‌వ‌రి 11న చెన్నైలోని లీలా ప్యాలెస్ లో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సందీప్ కోశ్లా రూపొందించిన పింక్, బంగారపు చీరలో సౌంద‌ర్య‌ కనిపించగా..విశాగణ్ సంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోయాడు. వ‌ధూవ‌రుల‌ని తమిళనాడు సీఎం పలనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఆశీర్వ‌దించారు. ఇక కమల్ హాసన్, మణిరత్నం, సుహాసిని దంపతులు, ధనుష్, మోహన్ బాబు, లక్ష్మీ మంచు త‌దిత‌రులు సౌంద‌ర్య‌- విశాగ‌ణ్ వివాహానికి హాజ‌రై ఆ కార్య‌క్రమంలో సంద‌డి చేశారు. బాలీవుడ్ నుండి కూడా పలువురు ప్ర‌ముఖులు వీరి వెడ్డింగ్ ఈవెంట్‌కి హాజ‌ర‌య్యారు. అయితే ప్ర‌స్తుతం ఈ జంట హ‌నీమూన్‌లో భాగంగా ఐస్‌ల్యాండ్‌కి వెళ్లారు. అక్క‌డ ఇద్ద‌రు క‌లిసి దిగిన ఫోటోల‌ని సౌంద‌ర్య ర‌జనీకాంత్ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ దేవుడు మాతో పాటు ఉన్నారు. వేద్‌ని మిస్ అవుతున్నామ‌ని కామెంట్ పెట్టింది. సౌంద‌ర్య‌, అశ్విన్ కుమార్‌ల‌కి జ‌న్మించిన వేద్‌ కృష్ణ ప్ర‌స్తుతం సౌంద‌ర్య ద‌గ్గ‌రే ఉంటున్న సంగ‌తి తెలిసిందే.



2107
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles