నేను గ‌ర్భ‌వ‌తిని కాదు : హీరోయిన్

Tue,June 19, 2018 09:56 AM
shilpa condense the rumors

ఈ మ‌ధ్య కాలంలో సినీ సెల‌బ్రిటీలకి సంబంధించిన ఏ విష‌య‌మైన సోష‌ల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంటుంది. సినిమా విష‌యాల‌నే కాకుండా వారి వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై కూడా జనాలు ఆరా తీస్తున్నారు. ఏదైన విష‌యంపై కాస్త ప‌ట్టు దొరికితే చాలు వెంట‌నే ఆ మేట‌ర్‌ని సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేసి వైర‌ల్ చేస్తున్నారు . తాజాగా బాలీవుడ్ అందాల భామ ప్ర‌గ్నెన్సీ అంటూ పుకార్లు సృష్టించారు. రీసెంట్‌గా శిల్ప ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కి వెళ్లి అక్క‌డ‌ నుంచి రిపోర్టులతో బయటకు వస్తుంది. ఆ స‌మ‌యంలో ఓ వ్య‌క్తి ఫొటో తీసి దానిని సోషల్‌ మీడియాలో షేర్ చేసాడు. దీంతో అది వైరల్‌గా మారింది. శిల్పా గర్భవతి అని, వైద్య పరీక్షల కోసం క్లినిక్‌కి వెళ్లి వస్తున్నారనీ వార్తలు మొదలయ్యాయి. దీనిపై శిల్పా స్పందించారు. ‘‘నా జీవితంలో కొత్తగా ఏమీ జరగలేదు.. నేను గర్భవతిని కాదు. రెగ్యులర్‌ చెకప్‌ కోసమే ఆసుపత్రికి వెళ్లి వచ్చా’’ అని శిల్పా అన్నారు. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి , ప్రముఖ బిజినెస్ మెన్ రాజ్ కుంద్రా నవంబర్ 22,2009న వివాహ బంధంతో ఒక్కటయిన విషయం విదితమే. తొమ్మది ఏళ్ల వివాహబంధంలో వీరికి వియాన్ అనే కుమారుడు మాత్రమే ఉన్నాడు.
5005
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS