కట్టప్ప క్షమాపణలతో బాహుబలి లైన్ క్లియర్ కానుందా?

Fri,April 21, 2017 12:31 PM
కట్టప్ప క్షమాపణలతో బాహుబలి లైన్ క్లియర్ కానుందా?

బాహుబలి ది కంక్లూజన్ చిత్రం కర్ణాటకలో విడుదల అవుతుందా లేదా అనే సస్పెన్స్ కి తెరపడింది. కట్టప్ప (సత్యరాజ్) ఓ మెట్టు దిగి క్షమాపణలు చెప్పడంతో ఇక బాహుబలి 2 చిత్రం కర్ణాటక లో విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని భావిస్తున్నారు. సత్యరాజ్ తాజాగా 2 నిమిషాల 20 సెకన్ల వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఇందులో 9 ఏళ్ల క్రితం నేను చేసిన వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించండి. నేను కన్నడ ప్రజలకు ఎప్పుడు వ్యతిరేఖం కాదు. నాకు నటుడిగా ఛాన్స్ లు దొరకకపోయిన ఫర్వాలేదు, తమిళ ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతా.. దయచేసి బాహుబలి రిలీజ్ ని అడ్డుకోవద్దు అని సత్యరాజ్ అన్నారు. మరి సత్యరాజ్ స్టేట్ మెంట్ తో కన్నడిగులు కాస్త వెనక్కి తగ్గి సినిమా విడుదలకి ఎలాంటి అడ్డంకులు సృష్టించరని సినీ లవర్స్ భావిస్తున్నారు. ఏప్రిల్ 28న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో బాహుబలి ది కంక్లూజన్ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.


1665

More News

VIRAL NEWS