దిశా ప‌ఠానీ స్థానంలో సారా అలీ ఖాన్

Sun,December 16, 2018 12:35 PM
Sara Ali Khan to play female lead in  Baaghi 3

సైఫ్ అలీఖాన్, అమృత సింగ్‌ల గారాల ప‌ట్టి సారా అలీ ఖాన్ ఇటీవ‌ల రోజుల‌లో హాట్ టాపిక్‌గా మారింది. అభిషేక్ క‌పూర్ తెరకెక్కించిన కేదార్‌నాథ్ చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసింది అందాల భామ‌. సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ స‌ర‌స‌న న‌టించిన సారాకి మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక ప్ర‌స్తుతం ర‌ణవీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న సింబా చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపొందుతుంది. డిసెంబ‌ర్ 28న సింబా చిత్రంతో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది సారా. అయితే సారా ఖాతాలో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ చేరిన‌ట్టు తెలుస్తుంది.

తెలుగులో సూపర్ హిట్ అయిన వర్షం సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన చిత్రం బాఘీ. ఈ మూవీ హిట్ కావడంతో దీనికి సీక్వెల్‌గా బాఘీ2 చిత్రాన్ని తీసారు అహ్మద్ ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30న విడుద‌లై మిక్స్‌డ్‌ టాక్ ద‌క్కించుకుంది . చిత్రంలో టైగర్ ష్రాఫ్, దిశాపటానీ ప్రధాన పాత్రలలో పోషించ‌గా నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ బాఘీ2 రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండానే బాఘీ 3 కూడా ప్లాన్ చేశారు ఇందులోను టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా నటించనుండగా, క‌థానాయిక‌గా సారా అలీ ఖాన్‌ని తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. మొద‌టి రెండు సిరీస్‌ల‌లో క‌థానాయిక‌గా న‌టించిన దిశాప‌ఠానీని కాద‌ని సారాని ఎంపిక చేస్తారా లేదా అనే దానిపై క్లారిటీ త్వ‌ర‌లోనే రానుంది.

1664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles