అంత‌రిక్షం నేప‌థ్యంలో సినిమా చేయ‌నున్న మెగా హీరో

Sun,January 21, 2018 10:43 AM
sankalp reddy next movie with the space subject

ఘాజీ చిత్రంతో నేషనల్ స్టార్ డం పొందిన యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని ఎప్ప‌టి నుండో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటుండ‌గా, త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలుస్తుంది. అంత‌రిక్షం నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, తెలుగులో ఇలాంటి సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. సైన్స్ ఫిక్ష‌న్‌తో అభిమానులని ఎంత‌గానో అల‌రించేలా ఈ చిత్రం ఉంటుంద‌ని టాక్‌. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ తొలి ప్రేమ సినిమా ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత సంక‌ల్ప్ రెడ్డి ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలపైకి తీసుకెళ‌త‌డాని తెలుస్తుంది. క‌థాప‌రంగా వ‌రుణ్‌తేజ్ శిక్ష‌ణ కూడా తీసుకుంటాడ‌ని స‌మాచారం.

1669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles