ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్‌కి స్ట్రైట్ ఎంట్రీ

Thu,January 24, 2019 10:37 AM

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి త‌ర్వాత‌ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం తొలిషెడ్యూల్ పూర్తి చేసుకోగా రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో రెండో షెడ్యూల్ జ‌రుగుతుంది. ఈ చిత్రంలో పాత్ర‌ల‌కి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు అభిమానులకి అమితానందాన్ని క‌లిగిస్తున్నాయి. క‌థానాయిక‌లుగా కీర్తి సురేష్‌, ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తున్నార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు రాగా, ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని .. చరణ్ కు బాబాయ్ గా నటించనున్నాడని అన్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం స‌ముద్ర‌ఖ‌ని ఆర్ఆర్ఆర్‌లో న‌టించ‌డం క‌న్‌ఫాం అని అంటున్నారు. అయితే పాత్ర ఏంట‌నే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. కోలీవుడ్ లో ఫేమస్ అయిన ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఈ చిత్రంతో తెలుగులోకి స్ట్రైయిట్ ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నాడు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020లో తెలుగు తో పాటు హిందీ , తమిళ , మలయాళ భాషల్లో విడుదలకానుంది. కీరవాణి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.
2850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles