చిన్నారికి అండగా నిలిచిన సల్మాన్..

Sun,June 18, 2017 07:12 PM
salman helps to a child for operation


ముంబై: బాలీవుడ్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ ‘బీయింగ్‌ హ్యూమన్‌’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న విషయం తెలిసిందే. సినిమాలతో సంబంధం లేకుండా సమాజానికి తనవంతు సేవలందించేందుకు ముందుండే సల్మాన్ ఓ చిన్నారికి అండగా నిలబడి తన మంచి మనసును చాటుకున్నాడు. ఆపరేపన్ చేయించుకోలేని దీనస్థితిలో ఉన్న రెండేళ్ల చిన్నారికి సల్మాన్ఆర్థికంగా తనవంతు సాయం చేసి అండగా నిలబడ్డారు.

రాకేశ్‌ అవార్‌ కి యదన్య అనే రెండేళ్ల కొడుకు ఉన్నాడు. అతడు కాలేయ సంబంధ సమస్యతో బాధపడుతున్నాడు. కాలేయ మార్పిడి ఆపరేషన్ కు రూ.12 లక్షలు కావాల్సి ఉంది. దీంతో రాకేశ్ అవార్ బీయింగ్ హ్యూమన్ స్వచ్చంద సంస్థను ఆశ్రయించారు. బీయింగ్ హ్యూమన్ తరపు నుంచి చిన్నారికి రూ.2 లక్షలు అందజేశారు. సీఎం ట్రస్ట్, టాటా ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి మిగతా ఖర్చు చిన్నారికి సాయంగా అందింది. జులై 18న ముంబై అపోలో ఆస్పత్రిలో చిన్నారికి ఆపరేషన్ జరుగనుంది.

1677
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS