శైల‌జా రెడ్డి అల్లుడు చూడే సాంగ్ ప్రోమో విడుద‌ల‌

Wed,September 12, 2018 12:50 PM
Sailaja Reddy Alludu choode song promo released

నాగ చైత‌న్య-మారుతి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం శైల‌జా రెడ్డి అల్లుడు . అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ అత్త పాత్ర‌లో న‌టించారు . ప్రేమమ్, బాబు బంగారం వంటి చిత్రాలు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రాన్ని రూపొందించింది. శైల‌జా రెడ్డి చిత్రం కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కుల‌ని తప్ప‌క అల‌రిస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. రేపు చిత్రం వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌ల‌తో గ్రాండ్‌గా విడుద‌ల కానుండ‌గా, చిత్ర బృందం సినిమాపై ఆస‌క్తి క‌లిగించేలా వినూత్న ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు . తాజాగా గోపిసుంద‌ర్ సంగీతంలో రూపొందిన 'శైలజా రెడ్డి అల్లుడు జూడే ..సాంగ్ ప్రోమో వీడియో విడుద‌ల చేశారు. తెలంగాణ యాసలో సత్యవతి (మంగ్లీ) పాడిన ఈ పాటతో పాటు అందులోని స‌న్నివేశాలు ప్ర‌తి ఒక్క‌రిని అలరిస్తుంది. మ‌రి మీరు ఈ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి.

2480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles