గ‌ల్లీ బాయ్ రీమేక్ చేసేందుకు సిద్ధ‌మైన తేజూ ..!

Tue,February 19, 2019 12:29 PM

ర‌ణ‌వీర్ సింగ్‌, అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం గ‌ల్లీబాయ్. జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల అయి మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రానికి ఇండియ‌న్ క్రిటిక్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం జ‌ర్న‌లిస్ట్స్ నుండి కూడా ప్ర‌శంస‌లు ల‌భించాయి. ముంబై మురికి వాడల్లో పెరిగిన ఓ యువకుడు.. ఇండియాలోనే టాప్ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించారు. మేరీ గల్లీ, రూట్స్‌లాంటి హిట్ ర్యాప్ సాంగ్స్ సృష్టికర్త అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. అయితే ఈ మూవీని రీమేక్ చేయాల‌ని మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ భావిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం చిత్ర‌ల‌హ‌రి చిత్రంతో బిజీగా ఉన్న తేజూ ఈ మూవీ పూర్తైన త‌ర్వాత గల్లీ బాయ్ రీమేక్‌కి సంబంధించి చ‌ర్చ‌లు జ‌ర‌పనున్నాడ‌ట‌. మ‌రి కొద్ది రోజులుగా ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సాయిధ‌ర‌మ్ రీమేక్ చిత్రంతో అయిన మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంటాడా లేదా చూడాలి.

1714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles