మెగా హీరో సినిమా షూటింగ్ మొద‌లు పెట్టిన వినాయ‌క్‌

Fri,September 22, 2017 01:29 PM
మెగా హీరో సినిమా షూటింగ్ మొద‌లు పెట్టిన వినాయ‌క్‌

మెగాస్టార్ చిరంజీవి క‌మ్ బ్యాక్ చిత్రం ఖైదీ నెం 150తో బాక్సాఫీస్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు వివి వినాయ‌క్. ప్ర‌స్తుతం చిరు మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తో ఓ మూవీ ప్లాన్ చేశాడు. ఈ మూవీ గ‌త నెల‌లో పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది . ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించ‌గా, పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ లు స్క్రీన్ ప్లే అందించ‌నున్నారు. తేజూ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయికగా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. అయితే ఈ మూవీ నేడు సెట్స్ పైకి వెళ్లింది. ఈ సంద‌ర్భంగా సాయి ధ‌రమ్ తేజ్ త‌న‌ ట్విట్ట‌ర్‌లో వినాయ‌క్‌తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఆనందాన్ని తెలియ‌జేశాడు. వినాయ‌క్ గారితో తొలి రోజు ప‌ని చేస్తున్నాను.. క‌ల నిజ‌మైంది.. గొప్ప అవ‌కాశం ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు అని తేజూ ట్వీట్ చేశాడు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. గ‌తంలో చిరంజీవి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ని డ్యూయ‌ల్ రోల్‌లో చూపించిన వినాయ‌క్ ఈ సారి తేజూని కూడా డ‌బుల్ రోల్‌లో చూపించాల‌ని భావిస్తున్నాడు. పక్కా మాస్ క‌థ‌తో తేజూ కెరియ‌ర్‌కి చాలా హెల్ప్ అయ్యేలా ఈ మూవీని తెర‌కెక్కించాల‌ని వినాయ‌క్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. తిక్క‌, విన్న‌ర్,న‌క్ష‌త్రం ఇలా వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న సాయిధ‌ర‌మ్ తేజ్ కెరియ‌ర్‌కి ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైనర్ చాలా హెల్ప్ అవుతుంద‌ని స‌మాచారం. ఈ చిత్రం కోసం ‘ఇంటలిజెంట్’ అనే టైటిల్‌ను ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు దుర్గ అనే టైటిల్‌ను కూడా చిత్రయూనిట్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


1466

More News

VIRAL NEWS