వీడియో ద్వారా సోష‌ల్ మెసేజ్ ఇచ్చిన బిగ్ బాస్ ఫేం రోల్ రైడా

Wed,June 19, 2019 01:01 PM
Roll Rida And Kamran Dont Ride Rude video

ర్యాప్ సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోల్ రైడా బిగ్ బాస్ సీజ‌న్ 2 ద్వారా అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు . ప‌లు ఆల్బమ్స్ చేస్తూ అలరిస్తున్న రోల్ తాజాగా సోష‌ల్ మెసేజ్‌ని వీడియో ద్వారా తెలియ‌జేశాడు. ఈ వీడియోలో హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం, సిగ్న‌ల్ జంప్ చేయ‌డం వంటివి చేస్తే ఎదుర‌య్యే అన‌ర్ధాల‌ని పాట ద్వారా తెలియ‌జేశాడు. ప్ర‌తి నాలుగు నిమిషాల‌కి ఒక‌రు రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోతున్నారు. ధ‌నిక, పేద‌, ప‌ట్ట‌ణం, ప‌ల్లె, మ‌గ‌, ఆడ అనే తేడా లేకుండా రోడ్డు ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు. మ‌నంద‌రం క‌లిసి ప్ర‌జ‌ల‌లో సామాజిక చైత‌న్యం తీసుకురావాలి అని రోల్ పేర్కొన్నాడు. డోంట్ రైడ్ ర్యూడ్ అనే పేరుతో మ‌ధుర ఆడియో ఈ సాంగ్‌ని విడుద‌ల చేసింది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

2248
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles