డాన్-3 మూవీకి ప్లాన్..

Mon,June 19, 2017 04:54 PM
Ritesh Sidhwani plans to don 3 movie with shah rukh


ముంబై: బాలీవుడ్ స్టార్ షారుక్‌ఖాన్ నటించిన డాన్ మూవీ బాక్సాపీస్ వద్ద బిగ్గ్‌స్ట్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా డాన్-2 ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ డాన్ సిరీస్‌లో ‘డాన్-3’ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ యజమాని రితేశ్ సిధ్వానీ డాన్-3 ని తీయనున్నారు.

ఈ విషయమై రితేశ్ సిధ్వానీ మాట్లాడుతూ షారుక్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా డాన్-3 తెరకెక్కించాలనుకుంటున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ రెడీ అవుతున్నది. ఈ మూవీకి సంబంధించి త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. ఫర్హాన్ అక్తర్ షారుక్ కొత్త ప్రాజెక్టును డైరెక్ట్ చేయనున్నాడు. డాన్, డాన్-2 మూవీల్లో షారుక్‌కు జోడీగా ప్రియాంకచోప్రా నటించింది. తాజా ప్రాజెక్టులో కూడా ముచ్చటగా మూడోసారి ఈ క్రేజీ కాంబినేషన్ తెరపై సందడి చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

1450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS