విషెస్ చెప్పిన వారికి కృతజ్ఞతలు తెలిపిన రేణూదేశాయ్

Thu,September 21, 2017 04:23 PM
విషెస్ చెప్పిన వారికి కృతజ్ఞతలు తెలిపిన రేణూదేశాయ్

నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయితగా ఇలా అనేక విభాగాలలో అద్భుత ప్రతిభ కనబరచిన రేణూ దేశాయ్ త్వరలో బుల్లితెర ఎంట్రీ ఇవ్వబోతుంది. తెలుగులో తాను మొదలు పెట్టిన కొత్త ప్రయాణానికి అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతున్నారు. ఈ క్రమంలో తనపై చూపిస్తున్న ప్రేమకి రేణూ దేశాయ్ కృతజ్ఙతలు తెలిపింది. జడ్జ్‌గా తాను మొదలు పెట్టిన న్యూ జర్నీకి స్వాగతం చెప్పిన ప్రతి ఒక్కరికి మనఃపూర్వక ధన్యవాదాలు అని తెలియజేసింది రేణూ. నీతోనే డ్యాన్స్ అనే పేరుతో మొదలు కానున్న బిగ్ రియాలిటీ డ్యాన్స్ షోలో రేణూ దేశాయ్‌తో పాటు ఆదాశర్మ, జానీ మాస్టర్‌లు కూడా న్యాయ నిర్ణేతలుగా ఉంటారని టాక్. ఉదయబాను ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్టు సమాచారం. నీతోనే డ్యాన్స్ షోకి సంబంధించిన టీజర్‌ని రీసెంట్ గా విడుదల చేశారు. ఇందులో రేణూ డ్యాన్స్ అంటే రెండు హృదయాల భాష అని చెబుతుంది. అయితే ఆ వాయిస్ తనది కాదని, దబ్బింగ్ చెప్పే టైం లేకపోవడం వలన వేరే వాళ్ళతో చెప్పించినట్టు తెలుస్తుంది. షోలో మాత్రం తన వాయిసే వినవచ్చట. ఈ నెల 30 నుండి నీతోనే డ్యాన్స్ షో ప్రారంభం కానుంది.1481

More News

VIRAL NEWS