రావు రమేశ్ వాయిస్ ఓవర్ తో..

Sun,January 20, 2019 07:59 PM

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ సృష్టించి, జక్కన్న చిత్రంతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ సాధించిన ఆర్‌.పి.ఏ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న సినిమా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2. హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమవుతున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇద్నాని, నందిత శ్వేత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలక్షణమైన నటన, డైలాగ్స్ తో అందరినీ అలరించే రావు రమేశ్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించడం విశేషం. రావు రమేశ్ నటనకే కాదు వాయిస్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

విద్యుల్లేఖ రామన్‌, ప్ర‌భాస్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఆద్యంతం వినోదాత్మకంగా తెర‌కెక్కుతున్న ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుందనే నమ్మకముంది చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేసింది.

5475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles