ఖిల్జీ ఫస్ట్ డైలాగ్ విన్నారా .. వీడియో

Sat,January 20, 2018 11:45 AM
ఖిల్జీ ఫస్ట్ డైలాగ్ విన్నారా .. వీడియో

హైదరాబాద్: అల్లావుద్దిన్ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్ సింగ్ హడలెత్తిస్తున్నాడు. పద్మావత్ ఫిల్మ్‌లో ఖిల్జీగా రణ్‌వీర్ నటించాడు. ఆ ఫిల్మ్‌లో అతను చెప్పిన కొన్ని డైలాగ్స్ ఉన్న ప్రోమోను తాజాగా చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు. ఖిల్జీ ధైర్యసాహాసాలను రణ్‌వీర్ తన డైలాగ్‌లతో హోరెత్తించాడు. మొదట రిలీజ్ చేసిన పద్మావత్ ట్రైలర్‌లో కేవలం రాజ్‌పుత్‌ల డైలాగ్‌లు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు చిత్ర నిర్మాతలు కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో ఖిల్జీ పాత్ర పోషించిన రణ్‌వీర్ విరోచిత డైలాగ్‌లను వినిపించారు. యుద్ధానికి తాము ఎప్పుడూ సిద్ధం అంటూ హెచ్చిరిస్తున్న ఖిల్జీ పాత్రను రణ్‌వీర్ సూపర్బ్‌గా చేశాడు. తమ జెండా దేశమంతా ఎగురుతుందన్న కల వచ్చినట్లు రణ్‌వీర్ కొట్టిన డైలాగ్ ఓ హైలెట్. అయితే ఇదే ప్రోమోలో మహారావల్ రతన్ సింగ్ పాత్రను పోషించిన షాహిద్ కపూర్ డైలాగ్ కూడా ఉన్నది. ఖిల్జీ కత్తి కన్నా రాజ్‌పుత్‌ల ఛాతిలోనే ధైర్యం ఎక్కువ అన్న షాహిద్ డైలాగ్ ప్రేక్షకులను మరింత థ్రిల్ చేస్తోంది. పద్మావత్ ఫిల్మ్‌లో రాణి పద్మిని పాత్రను దీపికా పదుకునే పోషిస్తున్నది. భన్సాలీ తీసిన చిత్రం ఇప్పటికే సంచలనంగా మారింది. కర్ణిసేన వార్నింగ్, సెన్సార్ క్లియరెన్స్, సుప్రీం గ్రీన్ సిగ్నళ్ల మధ్య సతమతమైన విషయం తెలిసిందే. పద్మావత్ ఈనెల 25 రిలీజ్ కానున్నది.


663

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018