అరుదైన ఫోటో... కొణిదెల, నారావారి కోడ‌ళ్ల‌ కలయిక!

Sat,November 18, 2017 03:55 PM
అరుదైన ఫోటో... కొణిదెల, నారావారి కోడ‌ళ్ల‌ కలయిక!

ఒక్కోసారి సెలబ్రిటీలు ఒకరినొకరు అనుకోకుండా కలుస్తారు. అప్పుడు వాళ్ల మధ్య ఎటువంటి వైరాలు ఉన్నా... అవన్నీ పక్కన పెట్టి ఎంతో ఆప్యాయతతో పలకరించుకుంటారు. అటువంటి ఘటనే ఒకటి ఇవాళ జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు, సినీ హీరో బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి, సినీ హీరో చిరంజీవి కోడలు, రామ్‌చరణ్ భార్య ఉపాసన ఇవాళ ఓ రక్తదాన శిబిరంలో కలుసుకున్నారు.

రక్తదానం శిబిరంలో బ్రాహ్మణిని కలవడం ఎంతో సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేసింది ఉపాసన. అంతే కాదు.. ప్రతి ఒక్కరు 18 ఏండ్లకే రక్తదానం ఇవ్వడం ప్రారంభిస్తే.... 60 ఏండ్లు వచ్చే వరకు కనీసం 500 సార్లు రక్తం ఇవొచ్చని.. దీంతో 500 మంది ప్రాణాలను కాపాడిన వారవుతారని తెలిపింది. ప్రతి 90 రోజులకొకసారి రక్తాన్ని దానం చేసి కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడండి అంటూ ట్వీట్ చేసింది. రక్తదానం చేయడం ఎంతో సంతృప్తికరమైన, గొప్ప విషయమని ఆమె చెప్పింది. బ్రాహ్మణి రక్తదానం చేస్తుండగా.. తన పక్కన ఉపాసన కూర్చొని ఉన్న ఫోటోను కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది ఉపాసన. ఇక.. ఈ ఫోటోను అటు మెగా అభిమానులు, ఇటు బాలయ్య అభిమానులు తెగ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.2507

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018