నంది అవార్డులపై నంది విగ్రహం పాడిన పాట ఆర్జీవి స్టైల్ లో

Sat,November 18, 2017 10:23 AM
నంది అవార్డులపై నంది విగ్రహం పాడిన పాట ఆర్జీవి స్టైల్ లో

ప్రపంచంలో జరిగే ఏ వివాదాన్ని వదిలిపెట్టని వర్మ రెండు మూడు రోజులుగా నందుల ప్రకటనపై జరుగుతున్న వివాదంలోను దూరాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై వెరైటీగా సెటైర్లు వేశాడు. దీంతో ఒళ్ళు మండిన మద్దినేని రమేష్ తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా అసభ్య పదజాలంతో వర్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దీంతో వర్మ నందీ అవార్డులకి సంబంధించి ఒక పాటనే రెడీ చేసి ఏకంగా సోషల్ మీడియాలో విడుదల చేశాడు. అప్పుడెప్పుడో వచ్చిన ఓ సినిమాలోని జయమాలిని పాటని తీసుకొని దాని లిరిక్స్ మార్చి ‘అంకెలు చూస్తే తొమ్మిది, మా కోరిక మాత్రం కమ్మది' అంటూ పాట రెడీ చేశాడు. ఈ పాట ఘాటుతన్నాన్ని బట్టి చూస్తుంటే .. వివక్షాపూరితంగా నంది అవార్డులని ప్రకటించారనే తన అభిప్రాయాన్ని వర్మ ఈ విధంగా చెప్పాడా అంటూ పలువురు ముచ్చటించుకుంటున్నారు. మరి వర్మ సాంగ్ పై ఎవరెవరు ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.


890

More News

VIRAL NEWS