రామ్ కన్ఫాం చేశాడు

Sun,March 19, 2017 08:23 AM
రామ్ కన్ఫాం చేశాడు

హైపర్ సినిమా తర్వాత మరో సినిమాను ఓకే చేసేందుకు చాలా టైం తీసుకున్నాడు రామ్. ఈ హీరో మరోసారి నేను శైలజ ఫేం కిషోర్ తిరుమలతో కలిసి పనిచేయనున్నాడట. నేను శైలజ చిత్రం రామ్ కెరీర్ లో బెస్టి ఫిలింగా నిలిచింది. ఇందులో రామ్ ని చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. ఇప్పుడు రామ్- కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ తెరకెక్కనుందని అంటున్నారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని స్ర‌వంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అయితే రామ్ కొద్ది రోజులుగా తన బాడీతో పాటు గెటప్ ని కూడా పూర్తిగా మార్చేశాడు. ఇన్నాళ్ళు తన నెక్స్ట్ సినిమా ఏంటి అనే దానిపై పూర్తి క్లారిటీ ఇవ్వకపోయిన తన గెటప్ కి సంబంధించి మాత్రం ఒక్కో ఫోటో విడుదల చేస్తూ అభిమానులలో చాలా క్యూరియాసిటీ కలుగజేశాడు. ఏప్రిల్ 25 నుండి రామ్ -కిషోర్ తిరుమల తాజా ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తుండగా ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాశ్ కథానాయికలుగా నటించనున్నారు. నేను శైలజ చిత్రానికి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ తాజా ప్రాజెక్టుకి సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి సిరి వెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించనుండగా, సినిమాటోగ్ర‌ఫీ స‌మీర్ రెడ్డి , ఎడిటింగ్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ఆర్ట్ ఎ.ఎస్‌.ప్ర‌కాష్ అందిస్తున్నారు.

1297

More News

VIRAL NEWS