స్నేహ త‌న‌యుడితో చ‌ర‌ణ్ స‌ర‌దా ఆట‌లు

Sun,January 20, 2019 08:11 AM

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో కుటుంబ క‌థా చిత్రాల‌లో ఎక్కువ‌గా న‌టించి తెలుగింటి సీత‌మ్మ‌గా పేరు తెచ్చుకుంది స్నేహ‌. గ్లామ‌ర్‌తో పాటు ఫ్యామిలీ చిత్రాల‌తో అల‌రించిన స్నేహ‌కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోలీవుడ్ న‌టుడు ప్ర‌సన్న‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత స్నేహ పెద్ద‌గా సినిమాలు చేయ‌లేదు. అప్పుడ‌ప్పుడు స్పెష‌ల్ రోల్స్ లో తళుక్కున మెరిసిన ఈ అందాల భామ రీసెంట్‌గా రామ్ చ‌ర‌ణ్‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన విన‌య విధేయ రామ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రంకి సంబంధించిన స్వీట్ మెమోరీస్‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్నేహ‌ ప్రేక్షకుల‌కి ఆనందాన్ని పంచింది.


చిన్న పిల్ల‌లంటే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ సెట్‌లో స్నేహ కుమారుడు విహాన్‌తో స‌ర‌దాగా గ‌డిపాడు. ఓ సంద‌ర్భంలో విహాన్ జుట్టుని చ‌ర‌ణ్ స‌రి చేస్తుండ‌గా స్నేహ త‌న కెమెరాలో క్లిక్‌మ‌నిపించింది. ఈ ఫోటోని రీసెంట్‌గా తన‌ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్నేహ .. చరణ్‌కు విహాన్ పెద్ద అభిమాని.. నేను సెట్‌కు విహాన్‌ను తీసుకెళ్లిన ప్రతిసారీ వాడితో కలిసి చరణ్‌ ఆడుకునే వాడు. స్వీట్‌ హార్ట్స్‌..’ అని ఈ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు స్నేహ. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ ఫొటో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.


7505
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles