324 సంవత్సరాల ముసలి వ్యక్తిగా..

Fri,April 21, 2017 03:05 PM
324 సంవత్సరాల ముసలి వ్యక్తిగా..

నేషనల్ ఫిలిం అవార్డ్ విన్నింగ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు 324 ఏళ్ళ వయస్సు ఉన్న వ్యక్తి పాత్రలో నటించాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరియు కృతిసనన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న రాబ్తా చిత్రంలో రాజ్ కుమార్ విచిత్ర గెటప్ లో కనిపించనున్నాడట. దినేష్ విజన్ దర్శకత్వంలో రాబ్తా మూవీ తెరకెక్కగా ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఓ సర్ ప్రైజ్ తో ఎండ్ అయింది. ఆ సర్ ప్రైజ్ మరేదో కాదు రాజ్ కుమార్ రావు పాత్రేనట.

రాజ్ కుమార్ రావు 324 ఏళ్ళ ముసలి వ్యక్త పాత్రలో కనిపించేందుకు చాలానే కష్టపడ్డాడట. ఈ పాత్ర మేకప్ కోసం రోజుకి ఆరు గంటల సమయం పట్టగా, లాస్ ఏంజెల్స్ నుండి వచ్చిన ప్రత్యేక బృందం ఈ నటుడికి మేకప్ వేసినట్టు తెలుస్తుంది. దర్శకుడు ఈ పాత్ర కోసం 16 మందిని స్క్రీన్ టెస్ట్ చేసి చివరకి రాజ్ కుమార్ రావుని ఫైనల్ చేశారు. దినేష్ చాలా విజన్ ఉన్న డైరెక్టర్ అని, ఒక నటుడు తనలో ఉన్న టాలెంట్ ని నిరూపించుకునేందుకు చాలా ఫ్రీడమ్ ఇస్తాడని 32 ఏళ్ళ రాజ్ కుమార్ చెబుతున్నాడు. గతంలో రజినీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ,రిషీ కపూర్ వంటి వారు వెరైటీ వేషధారణలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే.

1768

More News

VIRAL NEWS