మోదీకి శుభాకాంక్ష‌లు తెలిపిన సూప‌ర్ స్టార్

Thu,May 23, 2019 02:26 PM
Rajinikanth wishes to modi

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి శుభాకాంక్ష‌లు తెలిపారు. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో ఘ‌న విజ‌యం సాధించినందుకు ఆయ‌న‌కు త‌న ట్విట్ట‌ర్ ద్వారా విషెస్ అందించారు ర‌జనీకాంత్‌. ప్రియ‌మైన న‌రేంద్ర‌మోదీ గారు మీకు హృద‌య పూర్వ‌క శుభాకాంక్ష‌లు.. మీరు అనుకున్న‌ది సాధించారు .. దేవుడు మిమ‌ల్ని చ‌ల్ల‌గా చూడాలి అని త‌న ట్వీట్ ద్వారా తెలిపారు ర‌జ‌నీ. లోక్ స‌భ ఎన్నిక‌ల‌కి దూరంగా ఉన్న ర‌జ‌నీకాంత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాన‌ని గ‌తంలో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. 2021లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా, అప్ప‌టి వ‌ర‌కు సినిమాలు చేస్తూ ఉంటార‌ట‌. రజనీ మక్కల్‌ మండ్రమ్‌ అనే తన అభిమాన సంఘం పేరుతో రాజకీయ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఆయ‌న‌ పార్టీ పేరు, కార్యాచ‌ర‌ణ ఏంట‌నే దానిపై ఇంత వ‌ర‌కు క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం ద‌ర్భార్ సినిమాతో బిజీగా ఉన్నారు ర‌జనీకాంత్.



3082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles