2.0 రిలీజ్ డేట్‌పై క్లారిటి వ‌చ్చేసింది..

Mon,August 21, 2017 03:59 PM
Rajinikanth, Akshay Kumars 2.0 to be released on January 25

హైద‌రాబాద్: ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్న 2.0 ఫిల్మ్ రిలీజ్ డేట్‌పై సందిగ్ధ‌త ఉన్న‌ది. ఇప్ప‌టికే ఆ ఫిల్మ్ రిలీజ్‌ను వాయిదా వేస్తూ వ‌స్తున్నారు. ఆ భారీ బ‌డ్జెట్ మూవీని వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తున్న‌ట్లు మ‌ళ్లీ పుకార్లు వ‌చ్చాయి. దీంతో ర‌జ‌నీ, అక్ష‌య్ ఫ్యాన్స్ తెగ టెన్ష‌న్‌కు గుర‌య్యారు. అయితే మూవీ క్రిటిక్, ట్రేడ్ అన‌లిస్ట్‌ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ మాత్రం ఈ ఫిల్మ్ రిలీజ్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25వ తేదీనే 2.0 రిలీజ్ అవుతుంద‌న్నాడు. 2.0 రిలీజ్ ఏప్రిల్‌కు వాయిదా ప‌డ్డ విష‌యం నిజం కాద‌ని, జ‌న‌వ‌రి 25నే విడుద‌ల అవుతుంద‌ని ఆద‌ర్శ్ ట్వీట్ చేశాడు. డైర‌క్ట‌ర్ శంక‌ర్ తీసిన‌ రోబోకు సీక్వెల్‌గా వ‌స్తున్న 2.0ను 400 కోట్ల‌తో నిర్మిస్తున్నారు. త‌మిళం, తెలుగు, హిందీ భాష‌ల్లో ఒకేసారి 2.0 రిలీజ్ కానున్న‌ది.


1144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS