రజినీకాంత్ తో ఫోటో దిగే ఛాన్స్..!

Fri,April 21, 2017 12:14 PM
రజినీకాంత్ తో ఫోటో దిగే ఛాన్స్..!

సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనని సినిమాల పరంగానే కాకుంగా పర్సనల్ గాను చాలా ఇష్టపడుతుంటారు. ఇక రజినీ స్టైల్ కి ఫిదా కాని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి స్టార్ హీరోతో ఫోటో దిగే ఛాన్స్ వస్తే ఎవరైన వదులుకుంటారా ? మరి త్వరలోనే ఆ అవకాశం అభిమానులకి రానుంది. ఏప్రిల్ 12 నుండి 17వ తేది వరకు రజినీకాంత్ తన అభిమానులని చెన్నైకి పిలిచి వారికి విందు ఇవ్వడంతో పాటు కలిసి ఫోటో దిగే అవకాశం ఇవ్వాలని భావించాడట. అయితే విడివిడిగా దిగుతామని అభిమానులు కోరడంతో అభిమానుల కలయిక పేరుతో వారి ఊర్లకే వెళ్లి ఫోటోలు దిగే కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. కాని కొన్ని కారణాల వలన ఈ కార్యక్రమం వాయిదా పడింది. కోలీవుడ్ సమాచారం ప్రకారం మే నెల మూడో వారంలో గానీ, జూన్‌ మొదటి వారం లో గానీ రజినీ తన అభిమానులతో కలిసే ప్రణాళికను సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక వేళ ఇదే జరిగితే 10 ఏళ్ళ తర్వాత రజినీ తన అభిమానులకి ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఇదే అవుతుంది.

940

More News

VIRAL NEWS