గ‌జ తుపాను బాధితురాలికి ఇల్లు క‌ట్టించిన లారెన్స్‌

Sun,May 19, 2019 12:38 PM
Raghava Lawrence helps to old lady

మ‌ల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ లారెన్స్ సినిమాల క‌న్నా సేవా కార్య‌క్ర‌మాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటారు. క‌ష్టాల‌లో ఉండే వారికి తోచినంత సాయం చేస్తూ ఉండే లారెన్స్ గ‌తంలో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. చిన్నారులకి ఓపెన్ హార్ట్ స‌ర్జరీలు చేయించ‌డం, ఆత్మ‌హ‌త్య చేసుకున్న ద‌ళిత విద్యార్ధినికి 15 ల‌క్ష‌లు సాయం చేయడం, ప్ర‌కృతి వైప‌రిత్యాల వ‌ల‌న స‌ర్వ‌సం కోల్పోయిన వారికి కొంత సొమ్ముని విరాళంగా ఇవ్వ‌డం లారెన్స్ మంచి మ‌న‌స్సుకు అద్దం ప‌డతాయి. గ‌త ఏడాది గజ తుఫాను ప్రభావంతో తమిళనాడులో సుమారు ఏడు జిల్లాల్లో ప్రాణనష్టంతోపాటు పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది. ఎంద‌రో నిరాశ్ర‌యిల‌య్యారు. ఓ వృద్ద మ‌హిళకి కూడు, గుడ్డ‌, నీడ లేకుండా పోయింది. కొంద‌రు ప్ర‌జ‌లు ఆ ముస‌లావిడని ఆదుకోమ‌ని ప్రార్ధించారు. ఈ విష‌యం లారెన్స్ దృష్టికి రావ‌డంతో వెంట‌నే స్పందించిన లారెన్స్ ఆ బామ్మ‌కి ఇల్లు క‌ట్టిస్తాన‌ని మాట ఇచ్చాడు. అన్న‌ట్టుగానే ఇల్లు క‌ట్టించి ఆమెకి ఓ నీడ చూపించాడు. ఇల్లు పూర్తైందని చెబుతూ గృహ ప్రవేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేశాడు లారెన్స్‌. ఆ ముస‌లావిడ ప‌రిస్థితిని త‌న దృష్టికి తీసుకు వ‌చ్చిన అభిమానుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. త‌ల్లుల‌కి సేవ చేయ‌డం ఎప్పుడు ఆనందంగా ఉంటుంద‌ని లారెన్స్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు.



1819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles